Travis Head : ఎప్పుడు ఎలా ఆడాలో మాకు వెన్నతో పెట్టిన విద్య..  ట్రావిస్ హెడ్

Travis Head

Travis Head

Travis Head : టీ 20 వరల్డ్ కప్ లో స్కాట్కాండ్ తో జరిగిన మ్యాచ్ లో పవర్ ప్లే లో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ తడబడ్డాడు. అయితే పవర్ ప్లే లో ఇప్పటి వరకు గత 30 మ్యాచుల్లో హెడ్ రికార్డు స్థాయి స్ట్రైక్ రేట్ 178తో ముందు వరుసలో ఉన్నాడు. ఆస్ట్రేలియా స్కాట్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో స్కాట్లాండ్ మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోరు చేసింది.  ఆ తర్వాత పవర్ ప్లే లో ఆస్ట్రేలియా బ్యాటర్లను వణికించే బౌలింగ్ తో అదరగొట్టింది.

అయితే పవర్ ప్లే లో దాటిగా ఆడే పేరున్న ట్రావిస్ హెడ్ ను స్కాట్లాండ్ బౌలర్లు ముప్పతిప్పలు పెట్టారు. దీంతో మొదటి 20 బంతుల్లో కేవలం 24 పరుగులే చేశాడు. ఒక్క ఫోర్ కొట్టడానికి మొదటి తొమ్మిది బంతులు తీసుకున్నాడంటే స్కాట్లాండ్ బౌలర్లు అతడిని ఎంత ఇబ్బంది పెట్టారో అర్థమవుతుంది. అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం హెడ్ మాట్లాడుతూ.. అన్ని సార్లు దూకుడైన ఆటతీరు సమాధానం కాదు. చివరికి గెలుపే లక్ష్యంగా పిచ్ కు బౌలర్లకు అనుగుణంగా మారాల్సిందే.

అదే పని ఈ మ్యాచ్ లో చేశారు. పిచ్ ను రీడ్ చేస్తూ మొదట స్లో గా బ్యాటింగ్ చేశాను. కానీ స్టోనియిస్ వచ్చీ రాగానే బౌండరీతో లయ అందుకోగానే.. తాను కూడా వేసుకున్న ప్లాన్ ప్రకారం.. దూకుడుగా ఆడి విజయాన్ని సాధించాం. స్పీడ్ గా ఆడలేదనే విషయాన్ని మాట్లాడుతున్నారు. కానీ మ్యాచ్ గెలిచిన విషయాన్ని గుర్తుంచుకోవాలని ట్రావిస్ హెడ్ అన్నాడు.

ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ లో అద్భుతంగా రాణించగా.. చివరి ఆరు ఓవర్లలో 89 పరుగులు చేసి ఆస్ట్రేలియా స్కాట్లాండ్ పై గెలిచింది. ఆస్ట్రేలియా సూపర్ 8 లో 24 వ తేదీన ఇండియాతో సెయింట్ లూసియా స్టేడియం లో ఆడనుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్, అనంతరం అఫ్గానిస్తాన్ లతో ఆడనుంది. 

TAGS