BJP leader: ఏపీలో బిజెపి నేత దారుణమైన నగ్న వీడియో వైరల్..
దీంతో ఆ పార్టీకి చెందిన వారు ఆ వీడియోని పార్టీ అధిష్టానానికి చెందిన పెద్దలకు పంపించి అతడి పై చర్యలు తీసుకోవాలని కోరినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా ఇదే గుంటూరు జిల్లాలో గతంలో జిల్లాకు చెందిన ఒక బీజేపీ నేత ఇలాంటి వీడియోలోనే దొరకడం విశేషం. అయితే గతంలో కరీంనగర్ బిజెపి జిల్లా అధ్యక్షుడుగా ఉన్నటువంటి ఒక సీనియర్ నేత కూడా ఇలా ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని నగ్నంగా ఉన్న వీడియో ఒకటి బయటపడింది.
దీంతో అప్పుడు అతడిని బిజెపి నుండి అధిష్టానం సస్పెండ్ చేసింది. గతంలో వైసీపీ ఎంపీ అయిన ఒక వ్యక్తి కూడా ఇలా నగ్నంగా ఒక మహిళతో వీడియో కాల్ లో మాట్లాడగా ఆ వీడియో సైతం బయటపడింది. ఇలా రాజకీయ నాయకులు చాలా మంది వీడియో కాల్స్ లో అసభ్యంగా ప్రవర్తిస్తూ పట్టుబడిన సందర్భాలు ఉన్నాయి. సభ్య సమాజంలో అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన రాజకీయ నాయకులు ఇలా వీడియోలు చేస్తూ పట్టుబడుతున్నారు.
దీంతో ప్రజల్లో చులకన భావం పెరిగిపోతుంది. అసలు వీరు రాజకీయ నాయకులేనా వ్యక్తిగతంగా ఇంతటి దారుణమైన పరిస్థితులలో ఉంటారా అనుకుంటూ ఛీదరించుకుంటున్నారు. మొత్తం మీద బిజెపి అధిష్టానం ఆ రాష్ట్ర అధికార ప్రతినిధి పై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.