Movies : థియేటర్లలో పెద్ద డిజాస్టర్, ఓటీటీలో కూడా అదేబాట ఇంతకీ ఏంటా సినిమా?
Movies : అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కాంబోలో నటించిన చిత్రం ‘బడే మియాన్ ఛోటే మియాన్’ ఇటీవల (జూన్ 6) నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. ఈ సినిమా థియేటర్లలలో బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో మేకర్స్ కనీసం ఓటీటీలో నైనా రిలీజ్ చస్తే అనుకున్న మేర వ్యూవ్స్ వస్తాయని భావించారు. వేగంగా ఓటీటీలోకి తీసుకువచ్చారు.
కానీ, ఓటీటీలో రెస్పాన్స్ కూడా థియేటర్ల కన్నా దారుణంగా మారింది. వ్యూవర్స్ ఈ మూవీని చూడటం మర్చిపోయి, ఆ తర్వాత బ్యాడ్ రివ్యూ ఇవ్వడంతో చాలా మంది ప్రేక్షకులు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లో ఈ మూవీని చూసేందుకు ఇష్ట పడడం లేదు. ఈ సినిమాను డిజిటల్ ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఒక దేశంలో మాత్రం కొంత పరవాలేదు అన్నట్లు చూస్తున్నా.. నెట్ ఫ్లిక్స్ స్ర్టీమింగ్ లో ఉన్న మరో 14 దేశాల్లో టాప్ 10లో కూడా నిలవకపోవడంతో వ్యూయర్ షిప్ సంఖ్య చాలా వరకు తగ్గింది. దీనికి సంబంధించి అధికారిక గణాంకాలను నెట్ ఫ్లిక్స్ త్వరలోనే ప్రకటించనుందని తెలుస్తోంది.
రూ. 350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు ఆది నుంచి ఫస్ట్ డే మార్నింగ్ షో నుంచే నిరాశ ఎదురైంది. ఇండియాలో థియేట్రికల్ గా కేవలం రూ. 60 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో కూడా అంతే ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది. ‘బడే మియాన్ ఛోటే మియాన్’ అన్ని విధాలా పూర్తిగా డిజాస్టర్ గా మారింది. ఈ సినిమాతో సంబంధం ఉన్నవారు దానితో తమ అనుబంధాన్ని మరచిపోవాలని కోరుకుంటారు. ఇంకొందరైతే సినిమా కలలో కూడా గుర్తుకు రావద్దు అనుకుంటున్నారు.