Big Boss House : బిగ్ బాస్ సీజన్ 8లో రెండవ వారం నామినేషన్ ప్రక్రియ పెను దుమారానికే దారి తీసింది. స్నేహితుల మధ్య చిచ్చు పెట్టింది. ఆదిత్య ఓం శేఖర్ బాషా ఇద్దరూ కంటెస్టెంట్లు ఇప్పటివరకు మంచి స్నేహితులుగా ఉన్నారు. అయితే మొదటి ఆదివారం నాగార్జున ఆదిత్య ఓం తో మాట్లాడుతూ అసలు హౌస్ లో ఉన్నాడా లేడా అనే విధంగా వ్యాఖ్యానించారు. దీంతో ఆదిత్య కు కొన్ని సూచనలు చేశాడు.
జనాలతో కలువు వారితో మాట్లాడు వారిని పలకరించు అని చెప్పారు. అయితే అలానే చేస్తానని నాగార్జునకు ఆదిత్య మాట ఇచ్చాడు. బిగ్ బాస్ హౌస్ లో ఉండే సీతతో మాట్లాడుతూ ఇప్పటి నుంచి తాను ఏంటో చూస్తారని చెప్పాడు. అదేవిధంగా అందరితో కలుస్తూ మాట్లాడుతూ ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. అయితే నామినేషన్ సందర్భంగా ఒక్కసారిగా శేఖర్ బాషా కు వెన్ను పోటు పొడిచారు. శేఖర్ భాషా ను నామినేట్ చేయడానికి వెనకాడ లేదు.
శేఖర్ బాషా ఆదిత్య ఓం తో మాట్లాడడానికి వస్తున్న సమయంలో నా దగ్గరికి రాకు అక్కడే ఉండు అంటూ దురుసుగా మాట్లాడాడు. బెదిరించాడు. దీంతో శేఖర్ బాషా తో పాటు కంటెస్టెంట్స్ అందరు కంగు తిన్నారు. కాగా నువ్వు ఈ బిగ్ బాస్ హౌస్ కి పనికిరావు అంటూ శేఖర్ భాషను తిట్టిపోశాడు. మీకు రూల్స్ తెలియదు అంటూ బెదిరించాడు. నువ్వు రూల్స్ ఫాలో కాపు అని చెబుతూ నామినేట్ చేశాడు.
ఆ తర్వాత శేఖర్ భాషా కూడా ఆదిత్య ను నామినేట్ చేశాను అయితే ఈ సమయంలో తలపై పెయింట్ పోయాలి. ఆ సమయంలో శేఖర్ బాషా ఆదిత్య తలపై పెయింట్ పోస్తుండగా అది జారీ మొహంపై పడితే శేఖర్ బాషా వెళ్లి తుడిచాడు. నీతో ఆదిత్య ముద్దు పెట్టుకున్నాడు. ఇలా ఉన్నాడేంటి అని అనుకుంటున్నారు. మీరు ఈ మధ్య కొట్టుకునే వరకు వెళ్లిన చివరికి ముద్దు తో ప్రశాంతంగా ముగిసింది.