JAISW News Telugu

RBI Announced : 97.76 శాతం నోట్లు వెనక్కి.. ప్రకటించిన ఆర్బీఐ..

RBI Announced

RBI Announced

RBI announced : డీమోనిటైజేషన్ సమయంలో పెద్ద నోట్లు రూ. 1000, రూ. 500 నోట్లను రద్దు చేసింది మోడీ ప్రభుత్వం. ఆ తర్వాత మార్కెట్ లోకి రూ. 2000 నోట్లను ప్రవేశపెట్టింది. ఇవి మార్కెట్ అంతటా విస్తరించాయి. కొన్నాళ్ల తర్వాత బహిరంగ ప్రకటన లాంటివి చేయకుండా పెద్ద నోట్లయిన రూ. 2000 నోటును ఆర్బీఐ తిరిగి తీసుకోవడం ప్రారంభించింది.

రూ.2000 నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన జారీ చేసింది. 2023, మే 19 నుంచి చెలామణిలో ఉన్న రూ. 2,000 నోటు 2024, మే 2వ తేదీ నాటికి 97.76 శాతం తిరిగి వచ్చినట్లు వెల్లడించింది.

RBI వివరాల ప్రకారం.. మార్కెట్‌లో ఉన్న రూ. 2 వేల నోట్ల మొత్తం విలువ 2023, మేలో రూ. 3.56 లక్షల కోట్ల నుంచి 2024, ఏప్రిల్ 30 నాటికి రూ. 7,961 కోట్లకు పడిపోయింది. అంటే ఈ పెద్ద నోట్ల లభ్యత గణనీయంగా తగ్గిందనమాట.

క్లీన్ నోట్ పాలసీ
కరెన్సీ చలామణిని క్రమబద్ధీకరించాలనే లక్ష్యంతో ఆర్బీఐ ‘క్లీన్ నోట్’ పాలసీ తీసుకుంది. ఇందులో భాగంగా రూ. 2000 నోట్లను వెనక్కు తీసుకుంది. నోట్ల మార్పిడి, డిపాజిట్ 2023, అక్టోబర్ 7వ తేదీ వరకు అన్ని బ్యాంక్ బ్రాంచ్‌ల్లో జరిగేవి. 2023, మే 19 నుంచి ఆర్బీఐ ఇష్యూ చేసిన కార్యాలయాల్లో మాత్రమే ఈ నోట్లను మార్చుకునే వెసులుబాటు కలిపించింది.

పోస్టాఫీస్ డిపాజిట్లు..

గతేడాది (2023) అక్టోబర్ 9 నుంచి ఆర్బీఐ కార్యాలయాలు వ్యక్తులు, సంస్థల నుంచి నోట్లను స్వీకరించి వారి బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్ చేశారు. ఇదే కాకుండా నోట్లను పోస్ట్ ద్వారా తమ ఖాతాల్లో క్రెడిట్ చేసేందుకు ఆర్బీఐ ఇష్యూ కార్యాలయానికి పంపవచ్చు.

అందుకే రూ. 2 వేల నోట్లు చలామణిలోకి..

ప్రధాని మోదీ తీసుకున్న నోట్ల రద్దు తర్వాత (రూ. 500, రూ. 1,000 నోట్లు) కరెన్సీ అవసరాలను తీర్చేందుకు ఆర్బీఐ రూ.2 వేల నోట్లను జారీ చేసింది. రూ.2 వేల నోట్లను రద్దు చేయడంతో 2018-2019లో రూ.2000 నోట్ల ముద్రణ నిలిచిపోయింది. మిగతా నోట్లు కూడా పూర్తిగా తిరిగివస్తాయని ఆర్బీఐ భావిస్తోంది.

Exit mobile version