
95 families left YCP and joined TDP
TDP : క్రోసూరు మండలం పెరికపాడు తండాకి చెందిన 85 కుటుంబాలు, అచ్చంపేట మండలం చామర్తి గ్రామానికి చెందిన 10 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. టీడీపీలో చేరిన వారికి పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.