TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 95 కుటుంబాలు – పెరికపాడుతండా 85, చామర్తిలో 10 కుటుంబాలు

95 families left YCP and joined TDP
TDP : క్రోసూరు మండలం పెరికపాడు తండాకి చెందిన 85 కుటుంబాలు, అచ్చంపేట మండలం చామర్తి గ్రామానికి చెందిన 10 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. టీడీపీలో చేరిన వారికి పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్తను టీడీపీ కడుపులో పెట్టుకుని చూసుకుంటుందని, అందరూ కలిసికట్టుగా తన విజయానికి కృషి చేయాలని కోరారు. కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
TAGS 95 Families Joined TDPBhashyam PraveenChamarthikrosurPerikapadu TandaTDPTDP Janasena BJP VS YCPTDP MLA candidate Bhashyam Praveen