JAISW News Telugu

Hanuman : టెక్సాస్ లో 90 అడుగుల హనుమంతుడు.. అమెరికాలో మూడో  అతి ఎత్తయిన విగ్రహం ఇదే..

Hanuman

Hanuman

Hanuman : టెక్సాస్ లోని హ్యూస్టన్ లో ఆగస్ట్ 18 ఆదివారం రోజున 90 అడుగుల ఎత్తయిన హనుమాన్ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించారు. అమెరికాలో ఇది మూడో ఎత్తయిన విగ్రహం అని గణాంకాలు చెబుతున్నాయి. ఈ విగ్రహానికి ‘స్టాచ్యూ ఆఫ్ యూనియన్’ అని పేరు పెట్టారు. ఇది శ్రీరాముడు-సీతను తిరిగి కలపడంలో హనుమంతుడి పాత్రను గుర్తు చేస్తుంది. టెక్సాస్ లోని షుగర్ ల్యాండ్ లో ఉన్న శ్రీ అష్టలక్ష్మి ఆలయం ఆవరణలో నిర్మించారు. ఈ ప్రాజెక్టు కోసం శ్రీ చినజీయర్ స్వామీజీ పని చేశారు.

స్టాట్యూ ఆఫ్ యూనియన్ వెబ్ సైట్ లో ఈ విగ్రహం ఉత్తర అమెరికాలోని ఎత్తైన హనుమంతుడి విగ్రహం అని, అతను ‘బలం, భక్తి నిస్వార్థ సేవకు ప్రతిరూపం’ అని రాశారు. హనుమంతుని దివ్య ఆశీస్సులు పొందడానికి భావి తరాలకు మార్గం సుగమం చేసేందుకు ఒక సమాజంగా మాకు ఇది ఒక అవకాశం అని రాసుకున్నారు.

టెక్సాస్ లోని షుగర్ ల్యాండ్ లో శ్రీ అష్టలక్ష్మి ఆలయంలో ఉన్న పంచలోహ అభయ హనుమాన్ 90 అడుగుల ఎత్తుతో నిల్చుని ఉంటారని, దాతృత్వం, బలం, ఆశను ప్రసరింపజేస్తుందని పేర్కొంది. ఓదార్పు, మనస్సాంతి, అతీత మార్గాన్ని కనుగొనే ఆధ్యాత్మిక కేంద్రాన్ని సృష్టించడం స్టాచ్యూ ఆఫ్ యూనియన్ లక్ష్యం. రామ భక్తిలో తరించే హనుమంతుడు సాక్షాత్తు మహాశుడి అంశ. రామాలయం ఎక్కడుంటే హనుమ ఆలయం అక్కడ ఉంటుంది. రాముడు లేకున్నా.. భక్తుల కోసం హనుమ ప్రతీ గ్రామంలో కొలువై ఉంటాడు.

‘తన భార్యను రక్షించే తపనలో రాముడు, తన సోదరుడు లక్ష్మణుడితో కలిసి వానర అని పిలువబడే తెలివైన కోతి యోధుడి జాతితో పొత్తు పెట్టుకున్నాడు, వారిలో హనుమంతుడు ఉన్నాడు. వేగం, బలం, ధైర్యం, వివేకంతో సహా సాహసం అంతటా రాముడి సేవలో హనుమంతుడు అసాధారణ సామర్థ్యాలను ప్రదర్శిస్తున్నందున, ఇద్దరి మధ్య స్నేహం కుదురుతుంది అది కాస్తా గాఢంగా మారుతుంది. చివరికి హనుమంతుడి సామర్థ్యం, అతని విధేయత, భక్తి అని రుజువు చేస్తుంది.’ అని హిందూ అమెరికన్ ఫౌండేషన్ పేర్కొంది.

Exit mobile version