JAISW News Telugu

Sea Turtle : సముద్ర తాబేలు మాంసం తిని 9 మంది మృతి.. అందరూ పిల్లలే

 Sea Turtle

Sea Turtle

Sea Turtle : టాజానియాలోని జాంజిబార్ ద్వీప సమూహంలోని పెంబా ద్వీపంలో సముద్ర తాబేలు మాంసం తిని ఎనిమిది మంది పిల్లలు, ఒక యువకుడు మరణించారు. 78 మంది హాస్పిటలైజ్ అయినట్లు అధికారులు శనివారం (మార్చి 9) తెలిపారు.

సముద్రపు తాబేలు మాంసాన్ని జాంజిబార్ ప్రజలు రుచికరమైనదిగా తింటారు. కానీ ఈ తాబేలులోని చెలోనిటాక్సిజం అనే ఒక రకమైనది ఉంటుందని. ఇది ఫుడ్ పాయిజన్ కు దారి తీసి మరణాలకు కూడా కారణం కావచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆలస్యంగా వెలుగులోని వచ్చిన ఈ ఘటనలో 8 మంది చిన్నారులు కాగా.. అందులో ఒకరికి తల్లి కూడా చనిపోయిందని Mkoani జిల్లా వైద్యాధికారి డాక్టర్ హాజీ బకారి తెలిపారు. తాబేలు మాంసం తినే వీరంతా మరణించినట్లు ఆయన ధృవీకరించారు.

బకారీ మీడియాతో మాట్లాడుతూ, బాధితులందరూ సముద్ర తాబేలు మాంసాన్ని తిన్నారని అదే వారి మరణానికి దారి తీసిందని ఈ విషయాన్ని వైద్యులు కూడా ధృవీకరించినట్లు పేర్కొన్నారు.

తూర్పు ఆఫ్రికా దేశమైన టాంజానియాలో సెమీ అటానమస్ ప్రాంతం అయిన జాంజిబార్‌లోని అధికారులు హమ్జా హసన్ జుమా నేతృత్వంలోని విపత్తు నిర్వహణ బృందాన్ని పంపారు. అక్కడికి వెళ్లిన వారు సముద్ర తాబేళ్లను తింటే మరణిస్తారని అవగాహన క్పలిస్తున్నారు.

నవంబర్ 2021లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. తాబేలు మాంసం తిన్న 3 ఏళ్ల చిన్నారితో సహా ఏడుగురు పెంబాలో మరణించగా, మరో ముగ్గురు ఆసుపత్రి పాలయ్యారు.

Exit mobile version