JAISW News Telugu

Gold Seized : బెంగళూరు ఎయిర్ పోర్టుల్లో 9 కిలోల బంగారం స్వాధీనం

Gold Seized

Gold Seized

Gold Seized : కర్నాటక రాజధాని బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టుబడింది. రెండు వేర్వేరు ఘటనల్లో దాదాపు రూ.6.29 కోట్ల విలువైన 9 కిలోల బంగారాన్ని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు గత మంగళవారం స్వాధీనం చేసుకున్నారు.

డిఆర్‌ఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం …  ముందుగా ఓ సిండికేట్‌ థాయ్ ఎయిర్‌వేస్‌ విమానంలో బంగారాన్ని దాచినట్లు డిఆర్‌ఐ అధికారులకు సమాచారం అందడంతో వెంటనే ఆ విమానాన్ని తనిఖీ చేశారు. విమానంలో వదిలేసిన ఓ హ్యాండ్‌ బ్యాగ్‌లో 6.834 కిలోల బంగారాన్ని గుర్తించారు. బ్యాగ్‌లోని పత్రాల ఆధారంగా ప్రయాణికులను గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించగా.. విమానంలో బంగారాన్ని దాచినట్లు వారు అంగీకరించారు. ఈ బంగారం విలువ రూ.4.77 కోట్లుగా అంచనా వేశారు.

కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దుబాయి నుంచి వచ్చిన ఎమిరేట్స్‌ విమానంలో 2.18 కిలోల బంగారాన్ని డిఆర్‌ఐ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. విమానం ముందు భాగంలోని లావేటరీలో నిషిద్ధ వస్తువుల్లో ఈ బంగారాన్ని దాచినట్లు గుర్తించారు. ఈ బంగారం విలువ రూ.1.52 కోట్లని అంచనా. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు డిఆర్‌ఐ అధికారి ఒకరు గురువారం తెలిపారు.

Exit mobile version