8 AM Metro : అభిమానులపై శాశ్వత ముద్ర వేసిన సినిమా..
8 AM Metro : గతంలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘మల్లేశం’ చిత్రాన్ని తెరకెక్కించిన రచయిత, దర్శకుడు రాజ్ ఆర్ తన తొలి హిందీ చిత్రం ‘8 ఏఎం మెట్రో’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇది ప్రస్తుతం జీ5 లో స్ట్రీమింగ్ అవుతోంది.
గుల్షన్ దేవయ్య, సయామీ ఖేర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్. మల్లాది కృష్ణమూర్తి రచించిన తెలుగు నవల ‘అందమైన జీవితం’ ఆధారంగా తెరకెక్కించడు దర్శకుడు.
రద్దీగా ఉండే హైదరాబాద్ నగరంలో జీవితంలోని సవాళ్లను నావిగేట్ చేస్తున్న ఐరావతి, ప్రీతమ్ జీవితాలను అన్వేషించడానికి ‘8 ఏఎం మెట్రో’ భాషా, సాంస్కృతిక అంతరాలను తొలగిస్తుంది.
ఈ చిత్రం తరచుగా పట్టించుకోని ఆందోళన, భయాందోళనలు మరియు సామాజిక ఇబ్బంది వంటి సమస్యలను చూపిస్తుంది. సానుభూతి, అవగాహన పరివర్తన శక్తిని ప్రదర్శిస్తుంది. లెజెండరీ లిరిసిస్ట్ గుల్జార్ ఈ సినిమా కోసం 6 కవితలు అందించారు. ఇది తెలుగు సాహిత్యానికి గర్వకారణమని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రం చిరస్థాయిగా నిలిచిపోయే కంటెంట్, మంచి నటనకు అన్ని వైపుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.
‘#8 AM Metro బసు ఛటర్జీ/ హృషికేశ్ ముఖర్జీ సినిమాను మళ్లీ చూసినట్లు అనిపించింది. ఇద్దరు వ్యక్తుల సింపుల్, రిఫ్రెషింగ్ కథ, రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్, ఆహ్లాదకరమైన సంగీతం, గుల్జార్ వెంటాడే కవిత్వంతో కూడిన యాదృచ్ఛిక స్నేహం. @gulshandevaiah ది బెస్ట్ – ఇప్పుడు @ZEE5India’ అని ఒక నెటిజన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.
‘# 8 AM Metro హృదయాన్ని హత్తుకునే చిత్రం. ఇద్దరు అపరిచితుల కథ, ఇద్దరు వ్యక్తుల మధ్య కొన్ని రోజుల సంబంధం కూడా వారి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చెప్తుంది. లోతైన సంభాషణలు, చక్కని కవితలతో నిండి ఉంది. చివరి 20 నిమిషాలు అసాధారణ, భావోద్వేగాలు కలిగి ఉంటాయి.’ అని మరొక నెటిజన్ పోస్ట్ చేశాడు.