
Pedakurapadu
Pedakurapadu : పెదకూరపాడు నియోజక వర్గంలోని క్రోసూరు మండలం తాళ్లూరులో టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తాళ్లూరులోని సుమారు 70 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. ముందుగా ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలో రోడ్ షో నిర్వహించగా తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీల నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.