త్వరలో 6g అందుబాటులోకి.. దీని వేగం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
6G Network : లండన్ లోని వయూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ వారు ఒక సరికొత్త సంచలన టెక్నాలజీని తీసుకురాబోతున్నారు. ఇప్పటికే టెక్నాలజీ పరంగా 5జి యుగం నడుస్తోంది. రాబోయే కాలంలో వెల్త్ యూనివర్సిటీ వారు 6జిని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది పూర్తిగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ. దీని ద్వారా ఒక పెద్ద సినిమాని కూడా ఒక సెకండ్ లోపే డౌన్లోడ్ చేసేంత ఫాస్ట్ గా పని చేస్తుందని తెలుస్తోంది.
ఇప్పటికే 5జి ద్వారా అనేకమైన సదుపాయాలు కలుగుతున్నాయి. చాలా సినిమాలు నిమిషం రెండు నిమిషాల్లోనే డౌన్లోడ్ అయిపోతున్నాయి. 5జి ద్వారానే అనేకమైన అవకాశాలు వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో మరింత అడ్వాన్స్డ్ టెక్నాలజీతో 6జిని తీసుకురావడం అనేది అతి పెద్ద సంచలనంగా మారనుంది. ఇది ఎంత ఫాస్ట్ గా పని చేస్తుందంటే 5జి కంటే తొమ్మిది వేల రేట్ల స్పీడ్ గా పనిచేస్తుందని తెలుస్తోంది. 938 జీబీపీఎస్ స్పీడ్ తో 6g టెక్నాలజీ పనిచేయనున్నట్లు సమాచారం.
50 జిబి గల అత్యాధునిక బ్లూ రే కలిగిన మూవీ నీ కూడా ఇది సెకండ్లోపే డౌన్లోడ్ చేసే అవకాశం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడున్న టెక్నాలజీ కంటే ఇది మరింత అడ్వాన్స్డ్ టెక్నాలజీగా వేగంగా చురుగ్గా పనిచేసే అవకాశం ఉంది. ఇది రాబోయే కాలంలో టెక్నాలజీలో ఒక విప్లవంగా మారనుంది. అల్ట్రా హై స్పీడ్ టెక్నాలజీ తో అనేక రకాలైన పనులను కేవలం సెకండ్లలోనే చేసుకునే అవకాశం 6జి ద్వారా ఉంది.
ఇప్పటికే 5g అనేక దేశాల్లో వినియోగిస్తున్నారు. 5జి ద్వారా చాలామంది అనేక రకాల ప్రయోజనాలు పొందుతున్నారు. అత్యంత అధునాతన టెక్నాలజీ అని ఇప్పుడు ఉన్న చాలామంది అనుకుంటున్నారు. కానీ రాబోయే కాలంలో లండన్ లోని యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ వెల్త్ రీసర్చ్ కు చెందిన వారు ఈ 6g ని అతి త్వరలో తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.