Dussehra : ఏపీలో దసరాకు 6100 ప్రత్యేక బస్సులు.. 10 శాతం రాయితీ
Dussehra Special Buses : దసరా పండగకు సొంతూళ్లకు వచ్చేవారి కోసం ఈ నెల 4 నుంచి 11 వరకు 3,040 బస్సులు, దసరా సెలవుల అనంతరం ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకు 3,060 బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ బస్సుల్లో కూడా హైదరాబాద్ నుంచి 990, బెంగళూరు నుంచి 275, చెన్నై నుంచి 65 బస్సులు నడిచేలా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే విజయవాడ నుంచి 400, విశాఖ నుంచి 320, రాజమహేంద్రవరం నుంచి 260, మిగిలిన జిల్లాల నుంచి 730 ప్రత్యేక బస్సులను నడుపనున్నారు.
దసరా సందర్భంగా నడుస్తున్న ప్రత్యేక బస్సులు అన్నింటిలోనూ సాధారణ ఛార్జీల వర్తిస్తాయని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రయాణికులు రాకపోకలకు కలిపి ఒకేసారి ముందుగా రిజర్వేషన్ చేసుకుంటే ఛార్జీలో 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ప్రయాణికుల కోసం హైదరాబాద్ తో పాటు మరికొన్ని ముఖ్యకేంద్రాల్లో అధికారులు, సూపర్ వైజర్లను నియమించారు. ఒకవేళ ఏదైనా రూట్ లో ప్రయాణికుల రద్దీ పెరిగితే వెంటనే మరిన్ని సర్వీసులు పెంచుతామని తెలిపారు.