TDP : టీడీపీలో చేరిన 55 కుటుంబాలు – మాచయపాలంలో 40, చండ్రాజుపాలెంలో 15 కుటుంబాలు

55 Families Joined TDP
TDP : బెల్లంకొండ మండలం మాచయపాలెం గ్రామానికి చెందిన 40 కుటుంబాలు వైఎస్ఆర్సిపి పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ వారికి పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
చండ్రాజుపాలెంలో వైసీపీని వీడిన 15 కుటుంబాలు
బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెం గ్రామానికి చెందిన 15 కుటుంబాలు వైఎస్ఆర్సిపి పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. తెలుగుదేశం పార్టీలో చేరిన వారికి పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా టీడీపీలో చేరిన గ్రామస్థులు మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల విధానాలు నచ్చి టీడీపీలో చేరామని, ముఖ్యంగా సూపర్-6 పథకాలతో పేదలు లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నామని తెలిపారు.
ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ను అత్యధిక మెజారిటీతో విజయం సాధించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఆయా గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.