52nd Anniversary : ఇండో -పాక్- బంగ్లాదేశ్ యుద్ధం 52వ వార్షికోత్సవం : అమెరికానే ఎదురించిన ధీరవనిత కథ
52nd Anniversary : 52 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఇదీ.. 1971 నవంబర్‌లో మన దేశంలో చాలా ముఖ్యమైన ఘటనలు జరిగాయి. చరిత్రను పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.
1971 నవంబర్ నెల.. ‘పాకిస్థాన్‌పై భారత్ ఏమైనా కుతంత్రాలు చేస్తే అమెరికా చూస్తూ ఊరుకోలేదు. భారతదేశానికి తగిన గుణపాఠం చెబుతుంది.’ అని నాటి అమెరికా అధ్యక్షుడు – రిచర్డ్ నిక్సన్ హెచ్చరించారు.
‘భారతదేశం అమెరికాను స్నేహితుడిగా పరిగణిస్తుంది. బాస్ గా కాదు. భారతదేశం తన విధిని తానే రాసుకోగలదు. పరిస్థితులకు అనుగుణంగా ప్రతి ఒక్కరితో ఎలా వ్యవహరించాలో భారత దేశానికి తెలుసు.’ అంటూ
– ఇందిరా గాంధీ ఏకంగా అమెరికాకు ఘాటు రిప్లై ఇచ్చింది.
భారత ప్రధాని ఇందిరా గాంధీ వైట్ హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్‌తో కూర్చున్నప్పుడు ఇలా సంభాషణ సాగింది. ఈ సంఘటనను అప్పటి రాష్ట్ర కార్యదర్శి, NSA హెన్రీ కిస్సింగర్ తన ఆత్మకథలో వివరించాడు.
ఈ మాటల తర్వాత భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ వైట్ హౌజ్ నుంచి వెళ్లిపోయింది. భారత్-అమెరికా మీడియా ప్రసంగాన్ని రద్దు చేసుకొని మరీ అక్కడి నుంచి వైదొలిగి ఏకంగా అమెరికాకే షాకిచ్చారు.
కిస్సింజర్, ఇందిరా గాంధీని తన కారులోకి ఎక్కించుకుంటూ, ‘మేడమ్ ప్రైమ్ మినిస్టర్, మీరు అమెరికా ప్రెసిడెంట్ తో కొంచెం ఓపికగా మాట్లాడి ఉండవచ్చని మీకు అనిపించలేదా?’ అన్నారు. ఇందిరా గాంధీ బదులిస్తూ ‘మిస్టర్ సెక్రటరీ, మీ విలువైన సూచనకు ధన్యవాదాలు. మాది అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి, అన్ని అగ్రరాజ్యాల దురాగతాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి కావసిన మేధాశక్తి, వనరులు ఉన్నాయి. మీరు ఏ దేశంపై ఆజమాయిషీ చేసినట్లు మాపైన చేస్తామంటే కుదరదు.’ అంటూ చెప్పింది.
ఆ తర్వాత, ఆమె ఎయిర్ ఇండియా బోయింగ్ న్యూఢిల్లీలోని పాలమ్ రన్‌వే వద్ద దిగిన వెంటనే, ఇందిరా గాంధీ ప్రతిపక్ష నాయకుడు శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయిని తన నివాసానికి పిలిపించారు. వీరి మధ్య రహస్య చర్చలు జరిగాయి. ఆ తర్వాత వాజ్‌పేయి హడావిడిగా వెనక్కి రావడం కనిపించింది. ఆ తర్వాత ఐక్యరాజ్యసమితిలో వాజ్‌పేయి భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తారని తెలిసింది.
వాజ్‌పేయిని బీబీసీకి చెందిన డొనాల్డ్ పాల్ ఒక సూటి ప్రశ్న సంధించారు. ‘ఇందిరాజీ మిమ్మల్ని ఒక కరడుగట్టిన విమర్శకుడిగా భావిస్తారు. అయినప్పటికీ, మీరు ఐక్యరాజ్యసమితిలో మీ గొంతు ను ఇందిరకు, భారత్ కు అనుకూలంగా మాట్లాడుతూ ఉంటారు. ఇది ఎలా సాధ్యం’ అని ప్రశ్నించాడు. దీనికి వాజ్ పేయి బదులిస్తూ ‘మా ఇంట్లో మేం కొట్టుకుంటాం.. తిట్టుకుంటాం.. కానీ దేశ ప్రయోజనాల కోసం ఏ దేశాన్ని అయినా ఎదిరిస్తాం.. కలిసి సాగుతాం’ అంటూ బదులిచ్చాడు.
చరిత్ర మనందరికీ తెలిసిందే. అమెరికా భారత్ ను వ్యతిరేకిస్తూ 270 ప్రఖ్యాత ప్యాటన్ ట్యాంకులను పాకిస్థాన్‌కు పంపింది. ఈ ట్యాంకులు ప్రత్యేకమైన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేయబడ్డాయి. అవి నాశనం చేయలేనివి అని నిరూపించడానికి వారు ప్రపంచ మీడియాను పిలిచారు. దీని వెనుక ఉద్దేశం చాలా స్పష్టంగా ఉంది. భారత్‌కు సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రావద్దని ప్రపంచ దేశాలకు ఇది హెచ్చరిక అనేలా పాక్ కు అమెరికా సాయం చేసింది..
అమెరికా ఇక్కడితో ఆగలేదు. భారత్‌కు చమురు సరఫరా చేస్తున్న ఏకైక అమెరికా కంపెనీ బర్మా-షెల్‌ను నిలిపివేయాలని ఆదేశించింది. ఇకపై భారత్‌తో వ్యవహరించడం మానుకోవాలని అమెరికా వారికి గట్టిగా చెప్పింది. ఆ తర్వాత ఇందిరా గాంధీ చురుకైన దౌత్యం నడిపి ఉక్రెయిన్ నుంచి చమురును తెప్పించింది.
థార్ ఎడారిలోని 270 ప్యాటన్ ట్యాంకుల్లో ఎక్కువ భాగాన్ని కేవలం ఒక రోజు జరిగిన యుద్ధంలో భారత్ నాశనం చేసింది. ధ్వంసమైన ట్యాంకులను ట్రాఫిక్ క్రాసింగ్‌లో ప్రదర్శించడానికి ఢిల్లీకి తీసుకువచ్చారు. రాజస్థాన్‌లోని ఎడారులు ఇప్పటికీ అమెరికా అహంకారానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
ఆ తర్వాత పద్దెనిమిది రోజుల పాటు సాగిన యుద్ధం 93,000 మంది పాకిస్తాన్ యుద్ధ ఖైదీలను పట్టుకోవడంతో యుద్ధం ముగిసింది. తర్వాత ముజిబుర్ రెహమాన్ లాహోర్ జైలు నుంచి విడుదలయ్యాడు. 1972 మార్చిలో ఇందిరా గాంధీ భారత పార్లమెంటులో బంగ్లాదేశ్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించింది. ఆ సమయంలో వాజ్‌పేయి ఇందిరా గాంధీని ‘మా దుర్గా’ అని సంబోధించారు.
– భారతదేశం యొక్క సొంత చమురు కంపెనీ, అనగా ఇండియన్ ఆయిల్ ఉనికిలోకి వచ్చింది.
– ప్రపంచం దృష్టిలో భారతదేశం తనను తాను శక్తిమంతమైన దేశంగా చాటుకుంది.
– భారతదేశం నాన్-అలైన్డ్ మూవ్మెంట్ (NAM) ముందు నుంచి నాయకత్వం వహించింది. దాని నాయకత్వం నిస్సందేహంగా ఉంది.
అయితే, అటువంటి సమయాలు, ఘటనలు భారత చరిత్రలో గొప్పగా నిలిచిపోయాయి. అమెరికాను ఎదురించిన ధీర వనితగా ఇందిరాగాంధీ నిలిచిపోయారు. నేటికీ సత్యమైన చరిత్ర తరతరాలకు అందించాల్సిన ఒక గొప్ప పాఠంగా మిగిలిపోయింది. ఈ ఏడాది ఇండో పాక్ బంగ్లాదేశ్ యుద్ధం 52వ వార్షికోత్సవం. ఈ చరిత్ర మన చిన్నారులకు, ఇప్పటి యంగ్ జనరేషన్ కు చెప్పాల్సిన అవసరం ఉంది.