Rajasthan : రాజస్థాన్ లో 52 డిగ్రీలకు ఉష్ణోగ్రత.. వాహనదారుల కష్టాలు చూడండి

Rajasthan

Rajasthan

Rajasthan : రాజస్థాన్‌లో వేసవి ఇప్పుడు దాని నిజస్వరూపం చూపెడుతుంది. రాష్ట్రంలోని అన్ని నగరాల్లో ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటింది. పలుచోట్ల 52 డిగ్రీలకు ఉష్ణోగ్రత చేరుకున్నట్లు ఓ వీడియో వైరల్ అవుతోంది. అది నిజమా లేదా అనేది తెలియకున్నా ప్రస్తుతం రాజస్థాన్‌లో ఎండ వేడిమికి జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మండుతున్న ఎండలకు వేడి పెరగడంతో మధ్యాహ్నానికి ప్రజలు వెలవెలబోయారు. మూడు, నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ తర్వాత కొన్ని డివిజన్లలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మే మధ్యకు రానే లేదు.. సూర్యుడు తన ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు.  రాజస్థాన్‌లోని దాదాపు సగం ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువగా ఉన్న ఉష్ణోగ్రత ఇప్పుడు సాధారణ స్థాయికి పెరిగింది. ఆదివారం రాష్ట్రంలోని అన్ని డివిజన్‌లలో సాధారణ ఉష్ణోగ్రతలు  40 డిగ్రీలకు పైగానే నమోదయ్యాయి. అయితే మధ్యాహ్నానికి ఎండలు, వేడిగాలులు వీస్తుండడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు.

 రానున్న రెండు, మూడు రోజుల్లో రాష్ట్రంలోని అన్ని డివిజన్లలో ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్‌ వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇది ఇలా ఉంటే రాజస్థాన్లో ఎండ వేడిమికి వాహనదారులు నానాఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి తాత్కాలిక ఊరట కల్పించేందుకు కొందరు రోడ్డుపై వెళ్లున్న వారిపై స్పెయర్లతో నీళ్లు చల్లుతున్నారు. రోడ్డుపై వచ్చిపోయే వారు ఈ నీటికింద ఎండ వేడితో కాస్త ఉపశమనం పొందుతున్నారు. ఇలా నీళ్లు చల్లుతున్న దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. చాలామంచి ఉపాయం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇది ఇలా ఉంటే వాతావరణ శాఖ మే 9 నుండి రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. మే 9, 10 తేదీల్లో ఉదయ్‌పూర్, జైపూర్, భరత్‌పూర్ డివిజన్‌లలో ఒకచోట వర్షం కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. దీంతో ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది.  అయితే, రాజస్థాన్‌లో రెండు రోజుల పాటు వాతావరణం పొడిగా ఉంటుంది.

TAGS