JAISW News Telugu

Girls pregnant : అమ్మాయిలను గర్భవతులను చేస్తే రూ.5 లక్షలు.. నమ్మి నిండా మునిగిపోయిన యువకుడు

Girls pregnant

Girls pregnant

Girls pregnant Money : దేశంలో మోసాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. మహిళను గర్భవతిని చేస్తే లక్షల్లో డబ్బు ఆశ చూపి కొత్త తరహా రాకెట్‌కు తెరతీసినట్లు పోలీసులు గుర్తించారు. గర్భం దాల్చలేని మహిళలను గర్భవతిని చేస్తే  ఒక వ్యక్తికి లక్షలు ఆఫర్ చేశారు. ఏ పని చేయకుండానే ఇంటి నుంచే డబ్బులు సంపాదించండంటూ మోసపూరిత ప్రకటనలు చూసి చాలా మంది అత్యాశకు పోయి నిలువునా మోసపోతుంటారు. తాజాగా మగవాళ్లను బాగా ఆకర్షించే ఈ విచిత్రమైన ఉద్యోగ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. రిచ్ ఫ్యామిలీలకు చెందిన యువతులకు కడుపు చేస్తే రూ.5 లక్షలు ఇస్తామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ వెరైటీ ప్రకటన చూసి ఒక యువకుడి ఆసక్తి చూపించాడు. దాంతో రిజిస్ట్రేషన్‌కు అని రూ.800, ఆ తర్వాత విదేశాలకు వెళ్లేందుకు పర్మిషన్‌ కోసమంటూ రూ.24 వేలు వసూలు చేశారు. ఆ తర్వాత మరో రూ.3 లక్షలు పంపాలంటూ డిమాండ్ చేశారు. దాంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌ సిటీలో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ మధ్య కాలంలో మౌ-ఐమా పట్టణంలోని బకర్‌గంజ్ ఏరియాకు చెందిన అల్తాఫ్ అనే పేరుగల యువకుడు సోషల్ మీడియాలో ఈ విచిత్రమైన ఒక ప్రకటన చూశాడు. ఆ ప్రకటనలో ధనవంతుల కుటుంబాలకు చెందిన అమ్మాయిలను ప్రెగ్నెంట్ చేస్తే రూ.5 లక్షలు ఇస్తామని, అంతేకాకుండా ఇతర సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. దాంతో అల్తాఫ్ ఆ ప్రకటనలో ఉన్న నెంబర్‌కు ఫోన్ చేసి, ముందుగా రూ.800 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాడు. తర్వాత అతడిని విదేశాలకు తీసుకెళ్లేందుకు పర్మిషన్ కావాలని, అందుకు పేపర్ వర్క్ పూర్తి చేయడానికి డబ్బులు కావాలని స్కామర్‌లు చెప్పారు. దాంతో వాళ్ల మాటలు నమ్మి అల్తాఫ్‌ మరో రూ.24 వేలు వారికి పంపించాడు. ఆ తర్వాత స్కామర్‌లు మరోసారి ఫోన్‌ చేసి తమకు ఈ సారి రూ.3 లక్షలు పంపాలని బెదిరించారు. అల్తాఫ్‌ రూ.3 లక్షలు డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో వారు అతనిపై కేసు పెడతామని, జైలుకు పంపిస్తామంటూ రివర్స్ లో బెదిరించారు. తాము పోలీసు అధికారులం అంటూ బెదిరించారు. దీంతో అల్తాఫ్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.

Exit mobile version