fake ration cards : కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఇప్పటి వరకు 20.4 కోట్ల రేషన్ కార్డుల డిజిటలీకరణ పూర్తయింది. డిజిటలైజేషన్ వల్ల ప్రజా పంపిణీ వ్యవస్థలో భారీ స్థాయిలో మార్పులు వచ్చాయని, తద్వారా ఆహార భద్రతలో ప్రపంచానికే బెంచ్ మార్కును నెలకొల్పినల్లయిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ వ్యవస్థ ద్వారా దేశంలో మొత్తంగా 80.6 కోట్ల మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందుతుండగా, ఆధార్ ధ్రువీకరణ, ఈకేవైసీ వెరిఫికేషన్ ల ద్వారా 5.8 కోట్ల నకిలీ రేషన్ కార్డులు తొలగిపోయాయని పేర్కొంది.
కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ ప్రకారం..ఇప్పటి వరకు 20.4 కోట్ల రేషన్ కార్డుల డిజిటలీకరణ పూర్తయింది. దేశవ్యాప్తంగా 5.33 లక్షల చౌకధరల దుకాణాలకు ఈపోస్ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. వీటి సాయంతో 99.8 శాతం కార్డులను ఆధార్ తో అనుసంధానం చేయగా, 98.7 శాతం లబ్ధిదారుల ధ్రువీకరణ పూర్తయింది. మరోవైపు ఈ కేవైసీ ప్రక్రియతో ఇప్పటి వరకు 64 శాతం లబ్ధిదారుల వెరిఫికేషన్ పూర్తయింది.