Vedic Clock : ఈ గడియారంలో గంటకు 48 నిమిషాలే..తొలి వేద గడియారం విశేషాలివే..

Vedic Clock

Vedic Clock

Vedic Clock : గత పదేళ్లుగా మోదీ ప్రభుత్వం భారతీయ సంస్కృతిని, ఆచార వ్యవహారాలను, అరుదైన భారతీయ విజ్ఞానాన్ని వెలికితీస్తోంది. ఇప్పటికే భారతీయ యోగాను ప్రపంచానికి పరిచయం చేశారు. అంతర్జాతీయంగా యోగాకు ఒక రోజును పాటిస్తున్నారంటే అది మోదీ వల్లే. గత పదేళ్లుగా మోదీ ప్రభుత్వం ఎవరూ ఊహించని పనులు చేశారు. భారతీయ సంస్కృతికి పెద్దపీట వేసి భారత్ అంటే ఇది అని ప్రపంచం మాట్లాడుకునేలా చేస్తున్నారు. 2047 నాటికి భారత్ ను విశ్వగురు చేసేందుకు బృహత్తర ప్రయత్నం చేస్తున్నారు.

మోదీ ప్రభుత్వం గత  భారతీయ వైభవాన్ని, విజ్ఞానాన్ని వెలికితీస్తోంది. అందులో ఒకటి ప్రపంచంలోనే తొలి  వేద గడియారం. దీన్ని మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని జిల్లాలో ఏర్పాటు చేయగా గత మార్చి 1న ప్రధాని మోదీ ప్రారంభించారు. వేద గడియారం ఉజ్జయిని జంతర్ మంతర్ లోని ప్రభుత్వ జివాజీ అబ్జర్వేటరీకి ఆనుకుని ఉన్న 85 అడుగుల టవర్ పై ఏర్పాటు చేశారు.

వేద గడియారం విశేషాలు:

– ఈ ప్రత్యేకమైన గడియారం వేద హిందూ పంచాంగం, గ్రహల స్థానాలు, ముహూర్తం, జ్యోతిష్య గణనలు, అంచనాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రదర్శిస్తుంది. భారతీయ ప్రామాణిక సమయం(ఐఎస్ టీ) మరియు గ్రీన్ విచ్ మీన్ టైమ్ (జీఎంటీ) కూడా సూచిస్తుంది.

– సమయ గణన అనేది ఒక సూర్యోదయం నుంచి మరొక సూర్యోదయం వరకు ఉన్న వ్యవధిపై ఆధారపడి ఉంటుంది.

– ఐఎస్ డీ ప్రకారం రెండు సూర్యోదయాల మధ్య సమయం 30 భాగాలుగా విభజించబడుతుంది. ప్రతీ గంటకు 48 నిమిషాలు, పఠనం 0:00 నుంచి 30 గంటల పాటు సూర్యోదయ విధులతో ప్రారంభమవుతుంది.(48 నిమిషాలు)

– గడియారం వేద హిందూ పంచాంగం నుంచి 30 ముహూర్తాలు, తిథి మరియు అనేక ఇతర సమయ గణనలను కూడా ప్రదర్శిస్తుంది. అలాగే సూర్య గ్రహణం, చంద్రగ్రహణాలను కూడా తెలుసుకోవచ్చు.

-ఈ వేద గడియారానికి ‘‘మహారాజా విక్రమాదిత్య వేద గడియారం’’ అని పేరు పెట్టారు.

ఉజ్జయినిలోనే ఎందుకు పెట్టారంటే..

 300 సంవత్సరాల కింద ప్రపంచ ప్రామాణిక సమయాన్ని నిర్ణయించడంలో ఉజ్జయిని కీలక పాత్ర పోషించింది.  ఉజ్జయిని ఒకప్పుడు భారత దేశం యొక్క సెంట్రల్ మెరిడియన్ గా పరిగణించబడింది. ఈ నగరం దేశం యొక్క సమయ మండలాలు, సమయ వ్యత్యాసాన్ని నిర్ణయించింది. ఇది హిందూ క్యాలెండర్ లో కాలానికి కూడా ఆధారంగా నిలిచింది. 18వ శతాబ్దం ప్రారంభంలో జైపూర్ కు చెందిన సవాయి జైసింగ్ -2 ఉజ్జయినిలోనే పురాతన అబ్జర్వేటరీ ఏర్పాటు చేశారు.

TAGS