Mark Zuckerberg : రోజుకు 4వేల కేలరీలు.. జుకర్ బర్గ్ ఆహారపు అలవాట్లు వింటే ఆశ్చర్యం కలగాల్సిందే?
Mark Zuckerberg : ప్రపంచంలో అపర కుభేరుల స్థానంలో ముందు వరుసలో ఉన్న వ్యక్తి ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్. ఆయన రోజును ఎలా ప్రారంభిస్తారు.. ఏం చేస్తారు.. ఎప్పుడు లేస్తారు. రాత్రి నిద్రపోయే వరకు ఏంఏం చేస్తారని తెలుసుకోవాలని సాధారణ వ్యక్తులకు ఉత్సాహం కలుగుతుంది. ఈ నేపథ్యంలో తన రోజువారి కార్యకలాపాలపై ఆయన తన అభిమానులతో పంచుకున్నారు. నిద్ర లేవగానే ఫస్ట్ ఫోన్ చూడడంతో తన రోజు మొదలవుతుందని చెప్పారు. ఫేస్ బుక్ లైవ్ సెషన్ లో ఆయన పలు విషయాలను వెల్లడించారు.
ఉదయం 8 గంటల వరకు నిద్ర లేస్తారట. లేవగానే తన ఫోన్ చేతిలోకి తీసుకొని ఫేస్ బుక్ ఓపెన్ చేస్తారనట. ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటారట. ఆయనకు స్పెడ్స్ ఉన్నాయట.. అవి పెట్టుకోకుంటే సరిగా కనిపించదట. అయినా సరే ప్రయత్నంగానే ఫోన్ చేస్తూ ఉంటారట. వారంలో కేవలం 50 నుంచి 60 గంటలు మాత్రమే కంపెనీ వ్యవహాలు చూసుకుంటానని జుకర్ బర్గ్ తెలిపారు. ఇక మిగిలిన సమయాన్ని కుటుంబంతో గడిపేందుకు ఇష్టపడతానని చెప్పుకచ్చారు. ఇంకా కంపెనీ, దాని భవిష్యత్ గురించి ఆలోచిస్తానని చెప్పారు. పని ఒత్తిడి నుంచి బయట పడేందుకు రోజుకు కనీసం 8 గంటలు నిద్రపోతానని వెల్లడించారు.
జుకర్ బర్గ్ కు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వారితో కలిసి ప్రముఖ పాప్ స్టార్ టేలర్ స్విఫ్ట్ పాటలు వినడం.. వాటిని సాధన చేయడం చేస్తుంటారని జుకర్ బర్గ్ భార్య ప్రసిల్లా చాన్ గతంలో తెలిపారు. టెస్లా అధినేత ఎలన్ మస్క్ తో కేజ్ ఫైట్ కు సిద్ధమవుతున్న జుకర్ దాని కోసం శిక్షణకు ఎంత సమయం కేటాయిస్తున్నారో చెప్పారు. వారానికి 3 రోజులు జాగింగ్.. మిగిలిన రోజులు జియు-జిట్సు, మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎమ్‌ఎమ్‌ఈ)కు సమయం వెచ్చిస్తానని తెలిపారు. ఆహారం విషయానికి వస్తే 4వేల కేలరీలు ఆహారంలో ఉండేలా చూసుకుంటారట. కఠినంగా శ్రమిస్తున్న సమయంలో ఇంత మొత్తం తీసుకోవాలని జుకర్ బర్గ్ చెప్పారు. అయితే రోజువారి ఆహారంలో ఎలాంటి పదార్థాలు ఉంటాయో చెప్పలేదు.