JAISW News Telugu

Union Minister Gadkari : ఏపీ రోడ్ల అభివృద్ధికి రూ.400 కోట్లు : కేంద్రమంత్రి గడ్కరీ

Union Minister Gadkari

Union Minister Gadkari

Union Minister Gadkari : ఏపీలో 200.06 కి.మీ. పొడవైన 13 రాష్ట్ర రోడ్ల అభివృద్ధికి కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (సీఆర్ఐఎఫ్) నుంచి రూ.400 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర రహదారి, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం ఎక్స్ లో వెల్లడించారు. గుంటూరు-నల్లపాడు రైల్వే మార్గంలో రూ.98 కోట్లతో శంకర్ విలాస్ ఆర్వోబీని 4 వరుసలతో నిర్మించడానికి ఆమోదం తెలిపినట్లు ప్రకటించారు. ఇటీవల సీఎం చంద్రబాబు కేంద్రమంత్రిని కలిసి రాష్ట్ర అవసరాల గురించి చర్చించిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.

Exit mobile version