దీంతో మొదటి వారంలో కలెక్షన్లు కాస్త తగ్గాయి. నిడివి ఎక్కువైందని ఎవరూ పట్టించుకోలేదు. కాకపోతే సెకండాఫ్‌లోని కొన్ని సన్నివేశాల గురించి చాలా మంది వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా అందరినీ సంతృప్తి పరచడం అసాధ్యం. ప్రస్తుతం సందీప్ ఓటీటీ వెర్షన్ యానిమల్ కోసం పని చేస్తున్నాడు. `కొత్త దృశ్యాలను జోడించాలా? వద్దా అనేది మేం ఆలోచిస్తున్నాము. ఎందుకంటే, నెట్‌ఫ్లిక్స్ ఇండియా కొత్త నిబంధనల ప్రకారం, సెన్సార్ పూర్తయిన తర్వాత మాత్రమే వారు తమ OTT ప్లాట్‌ఫారమ్‌లో సినిమాను విడుదల చేయాలి. కొత్త సన్నివేశాలను జోడించి మళ్లీ సెన్సార్‌కి వెళ్లాలా? లేక థియేట్రికల్ వెర్షన్ లోనే విడుదల చేయాలా? అనేది చూస్తున్నాం` అన్నాడు ప్రణయ్.
రణబీర్ కపూర్, రష్మిక జంటగా సందీప్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘యానిమల్’. అనిల్ కపూర్, బాబీ డియోల్ , త్రిప్తి డిమ్రీ కీలక పాత్రలు పోషించారు. తండ్రీకొడుకుల సెంటిమెంట్లతో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని టి సిరీస్ – భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యానిమల్ కి సీక్వెల్ గా యానిమల్ పార్క్ తీయనున్నట్టు సందీప్ వంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సీక్వెల్ కు కాస్త సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలో ప్రభాస్‌తో స్పిరిట్ సినిమాతో సందీప్ బిజీ కానున్నాడని ప్రణయ్ తెలిపాడు. ఆ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాతే యానిమల్ పార్క్ నిర్మిస్తాడు.