Seethamma Saree : భద్రాచలంలోని సీతమ్మవారికి రంగులు మారే త్రీ డీ చీరను రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ రూపొందించారు.
ఈ చీర ఐదున్నర మీటర్ల పొడవు, 48 అంగుళాల వెడల్పు ఉండగా బరువు 600 గ్రాములు ఉంది. నల్ల విజయ్ 18 రోజులు శ్రమించి బంగారు, వెండి, ఎరుపు వర్ణాలతో తయారు చేశారు. ఈ చీరను మంగళవారం భద్రాచలంలో సీతమ్మకు కానుకగా అందించనున్నట్లు విజయ్ తెలిపారు.