30th November Horoscope : నేటి రాశి ఫలాలు
30th November Horoscope : మేష రాశి వారికి గొడవలకు దూరంగా ఉండండి. మంచి కాలం. లాభాలు సాధిస్తారు. బంధువులతో సంతోషంగా గడుపుతారు. దత్తాత్రేయ స్వామి దర్శనం మంచి ఫలితాలు ఇస్తుంది.
వ్రషభ రాశి వారికి ఒక శుభవార్త సంతోషం కలిగిస్తుంది. చేపట్టే పనుల్లో ఉత్సాహం ఉంటుంది. సూర్య భగవానుడిని పూజించడం వల్ల మేలు కలుగుతుంది.
మిథున రాశి వారికి ఆనందం కలిగించే సంఘటనలున్నాయి. నచ్చిన వారితో సంతోషంగా గడుపుతారు. ధనలాభ సూచనలున్నాయి. దుర్గా స్తోత్రం చదవడం శుభకరం.
కర్కాటక రాశి వారికి ఒత్తిడిని అధిగమించాలి. పనిభారం ఎక్కువవుతుంది. బంధుమిత్రులు సహరిస్తారు. నవగ్రహ శ్లోకాలు చదవడం శ్రేయస్కరం.
సింహ రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంతోషంగా గడుపుతారు. ఆలోచించి ఖర్చు పెట్టాలి. సూర్యనారాయణ మూర్తిని ఆరాధించడం మంచి చేస్తుంది.
కన్య రాశి వారికి శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. మనోధైర్యంతో ముందడుగు వేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు. వెంకటేశ్వర స్వామి దర్శనం ఉత్తమం.
తుల రాశి వారికి ఆరోగ్యంగా ఉంటారు. ఖర్చులు అదుపులో ఉంచుకోవడం మంచిది. శ్రమ పెరుగుతుంది. సాయి నామం జపించడం మంచి ఫలితాలు తెస్తుంది.
వ్రశ్చిక రాశి వారికి శుభవార్తలు వింటారు. అనుకూల వాతావరణం ఉంటుంది. కీలక విషయాల్లో సలహాలు తీసుకోవాలి. శివ అష్టోత్తర శతనామావళి చదవడం శ్రేయస్కరం.
ధనస్సు రాశి వారికి కొన్ని చర్చలు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. తెలివితేటలతో ముందుకు వెళతారు. ప్రసన్నాంజనేయ స్వామి స్తోత్రం చదవడం మంచిది.
మకర రాశి వారికి కొన్ని సంఘటనలు ఉత్సాహ పరుస్తాయి. ఒక వార్త మీ ఇంట్లో సంతోషం నింపుతుంది. శుభకార్యక్రమాల గురించి ఆలోచిస్తారు. కనకధారాస్తవం మేలు కలిగిస్తుంది.
కుంభ రాశి వారికి అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సూచనలున్నాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. శని ధ్యానం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
మీన రాశి వారికి మనోధైర్యంతో ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. గణపతి ఆరాధన ఆటంకాలు లేకుండా చేస్తుంది.