JAISW News Telugu

PM Modi : 300 యూనిట్ల ఫ్రీ కరెంట్.. ప్రధాని కీలక ట్వీట్.. ఆఫర్ అస్సలు మిస్సవ్వద్దు..!

PM Modi

PM Modi

PM Modi : ప్రధాని మోడీ ఇటీవల ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’కు సంబంధించే అంతటా చర్చ నడుస్తోంది. ఈ పథకంతో దేశంలోని కోటి ఇళ్లకు ప్రతీ నెలా 300 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయబోతున్నారు.

ఇళ్ల పైకప్పులపై ప్యానెల్స్‌ను అమర్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ సబ్సిడీ ఇస్తుంది. గతంలోదీనిపై 40 శాతం సబ్సిడీ ఉంటే.. ఇప్పుడది 60 శాతానికి పెంచారు. మిగిలిన 40 శాతం రుణంగా కూడా తీసుకోవచ్చు.

ఇటీవల విత్త మంత్రి నిర్మలా సితారామన్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్ స్కీమ్‌ ను ప్రకటించారు. దీనితో కోటి మందికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని వెల్లడించారు. ప్రధానమంత్రి సూర్యోదయ యోజన కింద ఈ బెనిఫిట్ పొందొచ్చని మంత్రి తెలిపారు.

ఈ పథకం ద్వారా రూపాయి ఖర్చు లేకుండా ప్రజలు తమ ఇంటి పైకప్పులపై విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు. ఆర్థికంగా వెనుకబడిన వారు PMSY ద్వారా గరిష్ట ప్రయోజనాలు పొందాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది.

దీని ద్వారా వీలైనంత వరకు ఎక్కువ మంది వారి ఇళ్లలో ప్యానెల్స్‌ను పెట్టుకోవచ్చని ప్రభుత్వం చెప్తోంది. నెల వారీ విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కంటే తక్కువ ఉన్నవారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఈ పథకం అమలుకు ప్రభుత్వం స్పెషల్ పర్పస్ వెహికల్‌ రూపొందిస్తోంది.

ఈ పథకంపై ప్రధాని మోడీ రీసెంట్ గా ట్వీట్ చేశారు. దేశంలో స్థిరమైన అభివృద్ధి, ప్రజల శేయస్సుకు ‘ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

కోటి గృహాల్లో సౌర వెలుగులు నింపేలా పథకాన్ని అమలు చేస్తున్నామని, దీనికి 75 వేల కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. ఈ పథకంతో 300 యూనిట్ల ఉచిత కరెంట్ పొందవచ్చని ప్రధాని అన్నారు. సౌర విద్యుత్ వినియోగం పెంపు లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోంది.

ఈ సోలార్ పానల్స్‌తో ప్రతీ లబ్ధిదారుడు తమ అవసరానికి మించి కరెంట్ ఉత్పత్తి చేస్తే.. దానిని SPV కొంటుంది వచ్చిన డబ్బుల ద్వారా  రుణం కట్టుకోవచ్చు. ఇలా 10 సంవత్సరాల్లో మీ రుణాన్ని చెల్లిస్తారు. ఆ తర్వాత సోలార్ ప్యానెల్‌ను లబ్ధిదారుడి పేరుకు బదిలీ చేస్తారు.

Exit mobile version