Maoists Arrested : ఛత్తీస్ గఢ్ బీజాపూర్ జిల్లాలో 30 మంది మావోయిస్టులు మంగళవారం పోలీసు అధికారుల ఎదుట లొంగిపోయారు. వీరిలో 9 మంది కీలక మావోయిస్టు నేతలు ఉన్నారు. లొంగిపోయిన వారందరూ దండకారణ్య ప్రాంతంలో అనేక హింసాత్మక ఘటనల్లో పాల్గొన్నారని ఉన్నతాధికారులు ప్రకటించారు. లొంగిపోయిన వారిలో మున్ ముహందా అలియాస్ సుఖమతి, రజిత వెట్టి, దేవే కోవాసీ, అయితా సోధీ, మున్నా హేమ్లా, అయితు మిడియం, అయితు కరం తదితరులు ఉన్నారు. వీరందరిపై రూ.39 లక్షల రివార్డు ఉంది.
‘‘గత రెండేళ్లుగా సుమారు 150 మంది మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో మృతి చెందారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్ర, రాష్ట్ర బలగాలతో దండకారణ్యంలోకి అడుగుపెట్టి మావోయిస్టులను ఎదురుదెబ్బ తీస్తున్నాము. ఒకప్పుడు దండకారణ్యంలో సామంతు రాజ్యం నడిపిన మావోయిస్టులు ప్రస్తుతం అయోమయంలో పడ్డారు’’ అని పోలీసులు తెలిపారు.