Hero Father Remuneration : సాధారణంగా ఇప్పటి అగ్ర హీరోల రెమ్యూనరేషన్ 30 కోట్ల నుంచి 100 కోట్ల రూపాయల వరకూ ఉంది. 80,90 దశకాల్లో మాత్రం హీరోలకు లక్షల్లోనే ఉండేది. ఒక్క చిరంజీవి మాత్రమే కోటి నుంచి మూడు కోట్ల దాక తీసుకునే వారు. అలాగే నైజాం ఏరియా రైట్స్ కూడా తీసుకునే వారని సినీ పండితులు చెప్తుంటారు. అలాంటిది 1996లో వచ్చిన ఓసినిమా కోసం హీరో తండ్రి పాత్రకు రూ.30లక్షలు ఇచ్చారు. అప్పట్లో ఇది పెద్ద సంచలనమైంది.
ఆ సినిమా పేరు వజ్రం. హీరో నాగార్జున, దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, రోజా కాంబినేషన్ లో వచ్చింది. అయితే ఈ సినిమాలో నాగార్జున తండ్రి పాత్రకు కథలో చాలా ప్రాధాన్యముంటుంది. అయితే ఈ పాత్ర కోసం ఎవరిని తీసుకుందామా? అని కృష్ణారెడ్డి తెగ ఆలోచించారట. చాలా మంది ఆయన మైండ్ లో వచ్చిన ఎవరూ అంతగా నప్పలేదట. ఇక దీంతో ఆ పాత్ర కోసం డైరెక్టర్ కె.విశ్వనాథ్ ను అడుగుదామని.. నాగార్జునకు చెప్పగా ఆయన ఓకే అన్నాడట.
విశ్వనాథ్ దగ్గరకు వెళ్లిన కృష్ణారెడ్డి ఈ పాత్రకు మీరైతే బాగుంటుంది..చేయాలని బతిమాలరట. దానికి విశ్వనాథ్ నా సినిమాలతోనే బిజీగా ఉన్నా..చేయనంటే చేయను అన్నాడట. అయితే కృష్ణారెడ్డి మాత్రం ఆయనతోనే చేయించాలని ఫిక్స్ అయ్యాడు. మరోసారి ఆయన్ను కలిసి బతిమాలాడు. దీంతో ఓ 30లక్షలు ఇస్తే చేస్తా అని.. చెప్పేశాడు. అయితే కృష్ణారెడ్డి బారి నుంచి తప్పించుకోవడానికి విశ్వనాథ్ అలా చెప్పారు.
అయినా కృష్ణారెడ్డి పట్టువీడలేదు. నాగార్జున దగ్గరకు వెళ్లి ఆ పాత్రకు ఆయనైతేనే సూట్ అవుతారు.. రూ.30లక్షలు ఇచ్చినా పర్వాలేదని నాగ్ ను, నిర్మాతను ఒప్పించాడు. ఇక రూ.30లక్షలు ఇచ్చి విశ్వనాథ్ ను తండ్రిపాత్రకు లాక్ చేసేశారు. తండ్రి పాత్రకు అంత పెద్ద మొత్తం ఇవ్వడంతో ఆ వార్త అప్పట్లో పెద్ద సంచలనమైంది. సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో కూడా అంత భారీ రెమ్యూనరేషన్ తీసుకున్న వారు లేరు. ఆ సినిమాలో విశ్వనాథ్ క్యారెక్టర్ అద్భుతంగా పండింది. కానీ సినిమా మాత్రం పెద్దగా వర్క్ వుట్ కాలేదు. పాటలు బాగానే ఉన్నా ప్లాప్ గానే నిలిచింది.