JAISW News Telugu

29th November Horoscope : నేటి రాశి ఫలాలు

29th November Horoscope

29th November Horoscope

29th November Horoscope : మేష రాశి వారికి అనారోగ్య సమస్యలున్నాయి. కోపం పెంచుకోకూడదు. చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. గోసేవ చేయడం మంచి ఫలితాలు ఇస్తుంది.

వ్రషభ రాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ధనలాభ సూచనలున్నాయి. కొత్త పనులు మొదలు పెడతారు. లక్ష్మీదేవిని ఆరాధించడం మంచిది.

మిథున రాశి వారికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు. హనుమాన్ చాలీసా చదవడం మేలు.

కర్కాటక రాశి వారికి ఒక వార్త మనోబలం పెంచుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. లక్ష్మీదేవి దర్శనం అనుకూల ఫలితాలు కలిగిస్తుంది.

సింహ రాశి వారికి కొన్ని సంఘటనలు నిరుత్సాహం కలిగిస్తాయి. అనవసరంగా కష్టాల బారిన పడతారు. హనుమాన్ చాలీసా మంచి ఫలితాలు ఇస్తుంది.

కన్య రాశి వారికి సమయానుకూలంగా ముందడుగు వేస్తారు. కొత్త వస్తువులు సేకరిస్తారు. మంచి ఆలోచనలతో ముందుకు సాగడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. హనుమాన్ ఆరాధన మంచిది.

తుల రాశి వారికి ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఉత్సాహంతో పనిచేస్తారు. సంకల్పంతో పనులు పూర్తి చేసుకుంటారు. వెంకటేశ్వర స్వామి దర్శనం మేలు కలిగిస్తుంది.

వ్రశ్చిక రాశి వారికి చేపట్టే పనుల్లో వేగం ఉంటుంది. మానసికంగా బలంగా ఉంటారు. మంచి ఫలితాలు సాధించడానికి ఇది సరైన సమయం. ఇష్టదేవతా స్తోత్రం చదవడం శుభకరం.

ధనస్సు రాశి వారికి మీ పనితీరుతో ప్రశంసలు పొందుతారు. సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఆనందం కలిగిస్తాయి. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదవడం మంచి చేస్తుంది.

మకర రాశి వారికి ఒక శుభవార్త సంతోషం కలిగిస్తుంది. శత్రువులపై విజయం లభిస్తుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. శనిధ్యానం చేయడం శుభాలు కలిగిస్తుంది.

కుంభ రాశి వారికి శ్రమ ఫలితాలు ఇస్తుంది. సమయానికి సాయం చేసేవారుంటారు. ఆధ్యాత్మికత వైపు ఆలోచనలు చేస్తారు. ఆంజనేయ స్తోత్రం చదవడం అనుకూలంగా ఉంటుంది.

మీన రాశి వారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. శ్రమకు తగిన ఫలితాలు దక్కుతాయి. నిద్రాహారాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. విష్ణు ఆరాధన మంచి ఫలితాలు తెస్తుంది.

Exit mobile version