JAISW News Telugu

28th November Horoscope : నేటి రాశి ఫలాలు

28th November Horoscope

28th November Horoscope

28th November Horoscope : మేష రాశి వారికి అనారోగ్య సూచనలున్నాయి. కోపానికి తావివ్వకండి. చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. గోసేవ చేయడం మేలు కలిగిస్తుంది.

వ్రషభ రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. మంచి ఆలోచనలతో ముందుకు సాగుతారు. లక్ష్మీదేవిని ఆరాధించడం మంచిది.

మిథున రాశి వారికి మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు. ముఖ్యమైన విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

కర్కాటక రాశి వారికి ఒక వార్త మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. లక్ష్మీదేవి దర్శనం అనుకూలంగా ఉంటుంది.

సింహ రాశి వారికి కొన్ని సంఘటనలు విచారం కలిగిస్తాయి. కష్టాలు రాకుండా చూసుకోవాలి. పట్టుదలతో పనులు పూర్తి చేసుకుంటారు. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

కన్య రాశి వారికి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. మంచి మార్గంలో ముందుకు వెళ్లి అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఆంజనేయుడి ఆరాధన మేలు కలిగిస్తుంది.

తుల రాశి వారికి ప్రారంభించిన పనులు పూర్తి చేసుకుంటారు. ప్రయాణాల్లో ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. వెంకటేశ్వర స్వామి ఆరాధన మంచి చేస్తుంది.

వ్రశ్చిక రాశి వారికి మానసికంగా బలంగా ఉంటారు. చేపట్టే పనుల్లో పురోగతి దక్కుతుంది. ఇష్టదేవత ఆరాధన చేయడం శుభాలు కలిగిస్తుంది.

ధనస్సు రాశి వారికి శుభవార్తలు వింటారు. ముఖ్యమైన విషయాల్లో ఫలితాలు బాగుంటాయి. మీ పనితీరుతో ప్రశంసలు పొందుతారు. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదవడం ముఖ్యం.

మకర రాశి వారికి ఒక శుభవార్త సంతోషం కలిగిస్తుంది. శత్రువులపై పైచేయి సాధిస్తారు. చేపట్టే పనులు పూర్తి చేసుకోగలుగుతారు. శని ధ్యానం శ్రేయస్కరం.

కుంభ రాశి వారికి అవసరానికి సాయం చేస్తారు. ఆధ్యాత్మికత వైపు ఆలోచనలు చేస్తారు. శ్రమ పెరుగుతుంది. ఆంజనేయ స్తోత్రం చదవడం మంచిది.

మీన రాశి వారికి మానసిక ప్రశాంతత దొరుకుతుంది. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. తిండి, నిద్రకు ప్రాముఖ్యత ఇవ్వాలి. విష్ణు ఆరాధన శుభకరం.

Exit mobile version