28th January Horoscope : నేటి రాశి ఫలాలు

 

28th January Horoscope

28th January Horoscope

28th January Horoscope : మేష రాశి వారికి ఒక వార్త నిరుత్సాహం కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. కీలక విషయాల్లో సలహాలు తీసుకోవడం మంచిది. చంద్ర ధ్యానం చేయడం శుభకరం.

వ్రషభ రాశి వారికి చేయని తప్పులకు బాధ్యత వహించాల్సి వస్తుంది. చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. దుర్గాధ్యానం చేయడం శుభప్రదం.

మిథున రాశి వారికి ఆర్థిక లాభాలున్నాయి. పనులు సాఫీగా సాగుతాయి. సొంత నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తాయి. హనుమాన్ చాలీసా చదవడం మేలు కలిగిస్తుంది.

కర్కాటక రాశి వారికి అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మనో ధైర్యం కలిగి ఉంటారు. నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. వెంకటేశ్వరస్వామిని పూజించడం శ్రేయోదాయకం.

సింహ రాశి వారికి మంచి కాలం. మనసు ప్రశాంతంగా ఉంటుంది. వాతావరణం బాగుంటుంది. ఇష్టదేవతారాధన చేయడం బాగుంటుంది.

కన్య రాశి వారికి రుణ సమస్యలు లేకుండా చూసుకోవాలి. మంచి ఆలోచనలతో అనుకున్నది సాధిస్తారు. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం మంచి ఫలితాలు ఇస్తుంది.

తుల రాశి వారికి ఆదాయానికి తగిన విధంగా ఖర్చులుంటాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. సానుకూల ఫలితాలుంటాయి. ఈశ్వరారాధన శుభాలు కలిగిస్తుంది.

వ్రశ్చిక రాశి వారికి అనుకున్నది సాధిస్తారు. అధికారుల ప్రశంసలు దక్కుతాయి. కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. శ్రీరామ నామ స్మరణ మంచిది.

ధనస్సు రాశి వారికి అధికారులు అనుకూలంగా వ్యవహరిస్తారు. శుభఫలితాలు కలుగుతాయి. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. విష్ణు దర్శనం మేలు చేస్తుంది.

మకర రాశి వారికి ఉద్యోగంలో కష్టాలు ఎదురవుతాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. దుర్గామాత శ్లోకం చదువుకోవడం సురక్షితం.

కుంభ రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది. ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లండి. గోవిందనామాలు చదవడం ఉత్తమం.

మీన రాశి వారికి ప్రయాణాలు లాభిస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది. ఇబ్బందులను దూరం చేసుకుంటారు. సూర్యుడిని కొలవడం శుభప్రదం.

TAGS