25th November Horoscope : మేష రాశి వారికి ఒక శుభవార్త సంతోషాన్ని నింపుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తారు. సూర్యారాధన మంచిది.
వ్రషభ రాశి వారికి అనవసర భయాలు వద్దు. మనోబలం పెరుగుతుంది. సహనంతో ఉండాలి. చేపట్టే పనుల్లో ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. నవగ్రహ శ్లోకం చదవడం మేలు చేస్తుంది.
మిథున రాశి వారికి శత్రువులు మిత్రులుగా మారుతారు. చేపట్టే పనుల్లో శుభ ఫలితాలు దక్కుతాయి. అందరి సహకారాలు లభిస్తాయి. వెంకటేశ్వర స్వామి దర్శనం శుభకరం.
కర్కాటక రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలుంటాయి. ప్రణాళికా పరంగా ముందుకు వెళ్లాలి. గోవింద నామాలు చదవడం శ్రేయస్కరం.
సింహ రాశి వారికి చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇష్టదేవతారాధన బాగుంటుంది.
కన్య రాశి వారికి శారీరక శ్రమ పెరుగుతుంది. పనుల్లో ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో గొడవలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దుర్గాశ్లోకం చదవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
తుల రాశి వారికి శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆపదలు రాకుండా చూసుకోవాలి. చేపట్టే పనుల్లో ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. విష్ణు సహస్ర నామాలు పారాయణం చేయం ఉత్తమం.
వ్రశ్చిక రాశి వారికి ఒక విషయంలో మీ ప్రతిభ వెలుగు చూస్తుంది. ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తారు. ఇష్టదైవ స్తోత్రాలు చదువుకోవడం మేలు కలిగిస్తుంది.
ధనస్సు రాశి వారికి కొన్ని పనుల్లో జాప్యం జరగొచ్చు. ఆర్థికంగా బాగుంటుంది. ముందుకు పోవడం వల్ల అనుకూలంగా ఉంటుది. హనుమాన్ చాలీసా చదవడం మంచిది.
మకర రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దుష్టులకు దూరంగా ఉండటం మంచిది. పట్టుదలతో పనులు చేసుకుంటారు. ఈశ్వర దర్శనం కలిసి వస్తుంది.
కుంభ రాశి వారికి శ్రమ పెరుగుతుంది. గొడవలకు పోకూడదు. సమస్యలు లేకుండా చూసుకోవాలి. గోవిందనామాలు చదవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
మీన రాశి వారికి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. అధికారం బలంగా మారుతుంది. ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి. లక్ష్మీగణపతి ఆరాధన మేలు కలిగిస్తుంది.