Janasena : జనసేనకు 25 అసెంబ్లీ, 5 పార్లమెంట్ స్థానాలేనా?
Janasena : ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాల్లో మార్పులు వస్తున్నాయి. తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయడంతో సీట్ల పంపకం గురించి ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. కానీ పొత్తుల విషయంలో ఇంతవరకు వారి మధ్య కనీసం భేటీ కూడా జరగలేదు. చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడు పవన్ కల్యాణ్ వెళ్లి పరామర్శించడం తప్ప వారి మధ్య ములాఖత్ లు జరగలేదు. ఈనేపథ్యంలో పొత్తుల విషయంలో ఇంతవరకు క్లారిటీ రాలేదు.
తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఏపీలో జనసేనకు 25 అసెంబ్లీ 5 పార్లమెంట్ సీట్లు ఇచ్చేందుకు బాబు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ పవన్ కల్యాణ్ మాత్రం ఇంకా ఎక్కువ సీట్లు కావాలని అడుగుతున్నట్లు చెబుతున్నారు. దీంతో పొత్తుల విషయంలో ఇంకా రెండు పార్టీల్లో కచ్చితమైన చర్చలు ఇంతవరకు చోటుచేసుకోలేదు. అందుకే వారి మధ్య ఏకాభిప్రాయం రాలేదని తెలుస్తోంది.
పవన్ కల్యాణ్ కు ఉన్న ఇమేజ్ కి ఆయనకు ఎన్ని సీట్లు ఇచ్చినా తక్కువే. కానీ చంద్రబాబు మరీ 25 మాత్రమే ఇస్తానని చెప్పడం విడ్డూరమే. ఈనేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో సీట్ల విషయంలో క్లారిటీ వస్తే ప్రచారంలోకి దిగాల్సి ఉంటుంది. వైసీపీని ఎదుర్కోవాలంటే ముందే తమ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంటుందని పలువురు చెబుతున్నారు.
ఏపీలో నాలుగు పార్టీల మధ్య పోరు ఉండనుంది. ఈ సారి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంత ఆపార్టీ కూడా తన ప్రభావం చూపాలని ప్రయత్నిస్తోంది. ఈక్రమంలో రాష్ట్రంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో తెలియడం లేదు. టీడీపీ, జనసేన పార్టీలు తమ పొత్తుల విషయంలో ఇంతవరకు ఎలాంటి ములాఖత్ లు జరగలేదు. రెండు పార్టీలు పరస్పర అంగీకారంతో సీట్ల పంపకం జరిగితేనే సరైన రూట్ దొరుకుతుందని పలువురి అభిప్రాయం.