
Vehicle Fancy Number
Vehicle Fancy Number : తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా ఒక వాహన ఫ్యాన్సీ నంబరుకు ఏకంగా రూ.25.50 లక్షల రాబడి వచ్చింది. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ రవాణా కార్యాలయంలో సోమవారం కొత్త సిరీస్ ప్రారంభమైన సందర్భంగా ఆన్‌లైన్ వేలం నిర్వహించారు. టీజీ09 9999 నంబరును సోని ట్రాన్స్‌పోర్టు సొల్యూషన్స్ తమ టయోటా ల్యాండ్ క్రూజర్ ఎల్‌ఎక్స్ కోసం రూ.25,50,002లు చెల్లించినట్లు హైదరాబాద్ జేడీసీ సి.రమేశ్ తెలిపారు. దీంతోపాటు మరికొన్ని ఫ్యాన్సీ నంబర్ల వేలం ద్వారా ఒక్కరోజే రవాణా శాఖకు రూ.43,70,284 ఆదాయం సమకూరిందని ఆయన వివరించారు.
కాగా, ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ కు రూ.25.50 లక్షలు వెచ్చించడాన్ని తెలుసుకున్న కొందరు ఆ ధరతో మధ్య తరగతి వారు నాలుగు కార్లు కొనవచ్చని పేర్కొంటున్నారు.