23th November Horoscope : నేటి రాశి ఫలాలు
23th November Horoscope : మేష రాశి వారికి కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. గొడవలకు దూరంగా ఉండాలి. చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. గోసేవ చేయడం మంచిది.
వ్రషభ రాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మంచి ఆలోచనలతో అనుకున్నది సాధిస్తారు. లక్ష్మీదేవిని పూజించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
మిథున రాశి వారికి అనవసర ఖర్చులు పెరిగే అవకాశముంది. ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తారు. ఎవరితోనూ గొడవలకు వెళ్లకండి. ఇష్టదేవతారాధన మేలు కలిగిస్తుంది.
కర్కాటక రాశి వారికి అంచనాలు తారుమారవుతాయి. విలువైన వస్తువుల విషయంలో ఏమరుపాటు పనికి రాదు. సూర్యుడిని పూజించడం వల్ల అనుకూల ఫలితాలు ఏర్పడతాయి.
సింహ రాశి వారికి ఖర్చులు అదుపు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆచితూచి వ్యవహరించాలి. చేసే పనుల్లో శ్రమ పెరుగుతుంది. శ్రీరామ రక్షా స్తోత్రతం చదవడం మంచిది.
కన్య రాశి వారికి ఆధ్యాత్మికత వైపు ఆలోచిస్తారు. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్లండి. ఆశించిన ఫలితాలు వస్తాయి. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం శ్రేయస్కరం.
తుల రాశి వారికి ఒక శుభవార్త మీలో సంతోషం నింపుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అందరి సహకారం లభిస్తుంది. ఇష్టదేవతారాధన శుభం కలిగిస్తుంది.
వ్రశ్చిక రాశి వారికి పనులు పూర్తి చేసుకుంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది. మంచి ఆలోచనలతో ముందుకెళ్లాలి. ఆంజనేయ స్వామి స్తోత్రం చదవడం వల్ల మంచి జరుగుతుంది.
ధనస్సు రాశి వారికి కీలక విషయాలు కలిసి వస్తాయి. అధికారుల అండ ఉంటుంది. శ్రమతో విజయాలు దక్కుతాయి. వెంకటేశ్వర స్వామి ఆరాధన మేలు కలిగిస్తుంది.
మకర రాశి వారికి మనోధైర్యంతో ముందడుగు వేస్తారు. సహనంతో ఉండాలి. భవిష్యత్ గురించి ప్రణాళికలు వేస్తారు. ఆంజనేయ స్వామి దర్శనం మంచి ఫలితాలు ఇస్తుంది.
కుంభ రాశి వారికి బాధ కలిగించే సంఘటనలకు దూరంగా ఉండటం మంచిది. పనుల్లో అలసట లేకుండా చూసుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలవడం మంచిది.
మీన రాశి వారికి అధికారుల అండ ఉంటుంది. ఆర్థిక లాభాలున్నాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. పనులు నెరవేరతాయి. ఇష్టదేవతారాధన వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.