BJP Nazar : 23 సీట్లు.. బీజేపీ నజర్ అక్కడేనా..?

BJP Nazar

BJP Nazar

BJP Nazar : తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నది. అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ రేసులో దూసుకెళ్తున్నట్లు కనిపిస్తున్నది. ఇక తెలంగాణలో ప్రత్యామ్నాయమనుకున్న సందర్భంలలో ఊహించని విధంగా ఈ రేసులో వెనుకబడిన బీజేపీ, ఏదో పక్కా వ్యూహంతో వెళ్తున్నట్లు మాత్రం అర్థమవుతున్నది. ఏదో సైలెంట్ గేమ్ ఇందులో ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకానొక దశలో ప్రభుత్వాన్ని నువ్వా నేనా అన్నట్లు ఢీకొట్టిన బీజేపీ, ఈ రోజు కేవలం 23 సీట్లనే తన టార్గెట్ చేసుకున్నట్లు కనిపిస్తున్నదని టాక్ వినిపిస్తున్నది.

తెలంగాణ బీజేపీ తనకు పట్టున 23 సీట్లపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తున్నది. తద్వారా హంగ్ వస్తే కింగ్ మేకర్లుగా మారాలని  భావిస్తున్నది. అయితే బీజేపీ దృష్టంతా ఈ సారి ఉత్తర తెలంగాణపై నే ఉన్నట్లు కనిపిస్తున్నది.  ఇక గతంలో ముథోల్ లో రెండో స్థానంలో నిలవడంతో, ఈసారి అక్కడ పట్టుసాధించే ప్రయత్నం మొదలుపెట్టింది. దీంతో పాటు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ లోక సభ నియోజకవర్గాల పరిధిలో గతంలో 12 చోట్ల మంచి మెజార్టీ వచ్చింది. ఈ క్రమంలో ఆయా చోట్ల కూడా మరోసారి తన పట్టు నిలుపుకునే ప్రయత్త్నం కమలనాథులు చేస్తున్నారు.

ఇక గ్రేటర్ హైదరాబాద్ ఫలితాల్లోనూ బీజేపీ మంచి మార్కులు సాధించింది. ఇక్కడ కూడా ప్రధానంగా దృష్టి పెట్టింది. అయితే తెలంగాణలో హంగ్ కచ్చితంగా వస్తుందని బీజేపీ నమ్ముతున్నట్లు తెలుస్తున్నది. బలం లేని చోట్ల ఎలాగూ గెలవలేమని ముందే అస్ర్తసన్యాసం చేసినట్లు కనిపిస్తున్నది. చాలా చోట్ల ఓట్లు చీల్చడం మినహా, ప్రధాన రేసులో బీజేపీ ఉన్నట్లు కూడా కనిపించడం లేదు. ఈ సమయంలో బీఆర్ఎస్ ను గట్టెక్కించడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నదని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పక్కా ప్లాన్ ప్రకారమే ముందుకెళ్తున్నాయని ఆ పార్టీ తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు ఆరోపించారు. ఇక హంగ్ ను నమ్ముకుని వెళ్తున్న బీజేపీని ప్రజలు గట్టెక్కిస్తారా లేదా వేచి చూడాలి.

TAGS