22nd November Horoscope : నేటి రాశి ఫలాలు

22nd November Horoscope

22nd November Horoscope

22nd November Horoscope : మేష రాశి వారికి ఒక వార్త సంతోషం కలిగిస్తుంది. ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తారు. ఇంటి నిర్మాణం గురించి ఆలోచిస్తారు. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది.

వ్రషభ రాశి వారికి పనులు సాఫీగా సాగుతాయి. ఒక శుభవార్త సంతోషాన్ని కలిగిస్తుంది. మంచి ఆలోచనలతో ముందడుగు వేస్తారు. దుర్గాదేవిని ఆరాధించడం మేలు చేస్తుంది.

మిథున రాశి వారికి మీ పనితీరు ప్రశంసలు అందుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈశ్వర దర్శనం శుభకరం.

కర్కాటక రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి. కొన్ని సంఘటనలు బాధలు కలిగిస్తాయి. నిర్లక్ష్యం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. గోసేవ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

సింహ రాశి వారికి మనోధైర్యం పెరుగుతుంది. శారీరక శ్రమ పెరుగుతుంది. చేయని తప్పులకు బాధ్యులు కావాల్సి వస్తుంది. దుర్గా స్తోత్రం చదవడం మేలు కలిగిస్తుంది.

కన్య రాశి వారికి పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. మీ సంకల్పం నెరవేరుతుంది. చేపట్టే పనులు త్వరగా పూర్తవుతాయి. దైవారాధన చేస్తే మంచిది.

తుల రాశి వారికి కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఇష్టదేవతారాధన శుభకరం.

వ్రశ్చిక రాశి వారికి ఒక శుభవార్త సంతోషం కలిగిస్తుంది. మీ ఆలోచనలు మంచి ఫలితాలు వచ్చేలా చేస్తాయి. సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రం చదవడం మేలు.

ధనస్సు రాశి వారికి సంతోషకరమైన వార్తలు వింటారు. సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఆర్థిక లాభాలుంటాయి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం యోగం కలిగిస్తుంది.

మకర రాశి వారికి మనోధైర్యం పెరుగుతుంది. సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. చెంచలత్వంతో ఇబ్బందులు తెచ్చుకోవద్దు. విష్ణు నామస్మరణ ఉత్తమం.

కుంభ రాశి వారికి ఉద్యోగంలో బాగుంటుంది. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. సమయానికి సాయం చేసే వారుంటారు. శివారాధన మంచిది.

మీన రాశి వారికి ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. ఆచితూచి వ్యవహరించాలి. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదవడం వల్ల శుభాలు కలుగుతాయి.

TAGS