Kedarnath : కేదార్ నాథ్ లో 228 కిలోల బంగారం మాయం: జ్యోతిర్ మఠ శంకరాచార్య
Kedarnath : కేదార్ నాథ్ లో భారీ గోల్డ్ స్కాం జరిగిందని జ్యోతిర్ మఠ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద స్వామి అన్నారు. కేదార్ నాథ్ ఆలయం నుంచి సుమారు 228 కిలోల బంగారం మాయమైందని తెలిపారు. ఇప్పటి వరకు ఈ కేసులో దర్యాప్తు జరగలేదని అన్నారు. దీనికి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. ఇలాంటి స్కాంలకు పాల్పడి ఇప్పుడు ఢిల్లీలో కేదార్ నాథ్ ఆలయాన్ని కడతామని అనడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.
ప్రధాని మోదీ తనకు ప్రణామాలు చేశారని, తమ దగ్గరికి వచ్చిన వాళ్లను ఆశీర్వదించడం తమ విధానమని అవిముక్తేశ్వరానంద తెలిపారు. పీఎం నరేంద్ర మోదీ తమకు శత్రువు కాదని, ఆయన శుభం కోరుకునేవాళ్లమని, ఆయన సంక్షేమం గురించి ఆలోచిస్తామని, ఒకవేళ ఆయన తప్పు చేస్తే, ఆ విషయాన్ని ఎత్తి చూపుతామని ఆయన పేర్కొన్నారు.