21st November Horoscope : మేష రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. ప్రయాణాల్లో లాభాలున్నాయి. శుభ కార్యక్రమాల గురించి ఆలోచిస్తారు. ఉల్లాసంగా గడుపుతారు. ఆంజనేయ స్వామి దర్శనం మంచిది.
వ్రషభ రాశి వారికి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. పనులు త్వరగాపూర్తి చేసుకుంటారు. కుటుంబం కోసం శ్రద్ధ తీసుకోవాల్సి వస్తుంది. శివారాధన చేయడం శుభకరం.
మిథున రాశి వారికి ఉత్సాహంతో ముందడుగు వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ముందు చూపుతో జాగ్రత్తగా ఉండాలి. శ్రీరామ నామం జపించడం మేలు కలిగిస్తుంది.
కర్కాటక రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులను దూరం చేసుకోవాలి. పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. లక్ష్మీదేవిని ఆరాధించడం శుభం కలుగుతుంది.
సింహ రాశి వారికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉండాలి. ప్రయాణాల్లో లాభాలుంటాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళతారు. విష్ణుమూర్తిని ధ్యానించడం మంచిది.
కన్య రాశి వారికి ఆర్థిక లాభాలున్నాయి. వినోద కార్యక్రమాల్లో చురుకుగా ఉంటారు. మీ రంగంలో శుభ ఫలితాలు వస్తాయి. శివారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
తుల రాశి వారికి ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఆచితూచి వ్యవహరించాలి. అనుకున్నది సాధిస్తారు. ఇతరుల సహకారాలు లభిస్తాయి. హనుమాన్ చాలీసా చదవడం శ్రేయస్కరం.
వ్రశ్చిక రాశి వారికి మనోధైర్యంతో ముందడుగు వేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు పెరిగే అవకాశాలున్నాయి. రుణవిమోచన అంగారక స్తోత్రం చదవడం మంచిది.
ధనస్సు రాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది. పనుల్లో ఆటంకాలు అధిగమిస్తారు. మంచి ఆలోచనలతో ముందుకు వెళతారు. వెంకటేశ్వర స్వామిని పూజించడం మంచి ఫలితాలు ఇస్తుంది.
మకర రాశి వారికి చెంచల బుద్ధితో ఇబ్బందులు తెచ్చుకునే వీలుంది. ఇతరుల సహాయంతో పనులు చేసుకుంటారు. సూర్య భగవానుడిని పూజించడం ఎంతో మేలు.
కుంభ రాశి వారికి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. గొడవలకు వెళ్లడం మంచిది కాదు. ఆత్మీయుల సలహాలు తీసుకోవడం వల్ల మేలు కలుగుతుంది. గణపతి దేవుడిని ధ్యానించడం క్షేమం.
మీన రాశి వారికి ముందు చూపుతో వ్యవహరించాలి. ప్రణాళికతో ఉండాలి. మంచి ఆలోచనలతో పనిచేస్తే శుభ ఫలితాలు ఉంటాయి. సూర్యుడిని పూజించడం చాలా మంచిది.