JAISW News Telugu

21st January Horoscope : నేటి రాశి ఫలాలు

21st January Horoscope

21st January Horoscope

21st January Horoscope : మేష రాశి వారికి ఆర్థిక లాభాలున్నాయి. శత్రువులు తగ్గుతారు. ప్రయాణాల్లో మంచి ఫలితాలున్నాయి. నిర్ణయాలు తీసుకునేటప్పడు జాగ్రత్తగా ఉండాలి.

వ్రషభ రాశి వారికి కీలక విషయం గురించి అధికారులను కలుస్తారు. శుభ ఫలితాలున్నాయి. బంధు మిత్రులతో సంతోషంగా ఉంటారు. ఈశ్వర దర్శనం శ్రేయస్కరం.

మిథున రాశి వారికి భవిష్యత్ గురించి ప్రణాళికలు వేసుకుంటారు. చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. మొహమాటానికి పోతే నష్టాలొస్తాయి. లక్ష్మీగణపతి ధ్యానం శుభకరం.

కర్కాటక రాశి వారికి మంచి ఫలితాలు ఉన్నాయి. మంచి ఆలోచనలతో ప్రశంసలు అందుకుంటారు. శుభ సమయం. ఇష్టదేవతారాధన శుభప్రదంగా ఉంటుంది.

సింహ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. సంతోషంగా గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇష్టదేవతారాధన మంచిది.

కన్య రాశి వారికి అనవసర విషయాలు పట్టించుకోవద్దు. శారీరక శ్రమ పెరుగుతుంది. శివ నామ స్మరణ ఉత్తమ ఫలితాలు ఇస్తుంది.

తుల రాశి వారికి భాగస్వామ్య వ్యాపారాలు లాభాలు సాధిస్తాయి. సమాజంలో గుర్తింపు దక్కుతుంది. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. విష్ణు సహస్ర నామాలు చదువుకోవడం మేలు.

వ్రశ్చిక రాశి వారికి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. శ్రమ మంచి ఫలితాలు ఇస్తుంది. నవగ్రహ ధ్యానం చేయడం వల్ల మంచి ఫలితాలు రావడం జరుగుతుంది.

ధనస్సు రాశి వారికి విజయావకాశాలున్నాయి. ప్రయాణాల్లో లాభాలున్నాయి. కుటుంబ వాతావరణం బాగుంటుంది. ఇష్టదేవతారాధన శుభకరం.

మకర రాశి వారికి శుభ సమయం. ఆర్థికంగా బాగుంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. గాయత్రి మంత్రం చదువుకోవడం ఉత్తమం.

కుంభ రాశి వారికి ఉత్సాహం కలుగుతుంది. నలుగురికి ఉపయోగడే పనులు చేయడం వల్ల మంచి పేరు వస్తుంది. గణపతి మంత్రం చదువుకుంటే ఇబ్బందులు ఉండవు.

మీన రాశి వారికి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. అవసరానికి సాయం చేసే వారున్నారు. మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. విష్ణు సహస్ర నామం పారాయణం చేయడం మంచిది.

Exit mobile version