20th November Horoscope : నేటి రాశి ఫలాలు
20th November Horoscope : మేష రాశి వారికి చేపట్టే పనులు వేగంగా పూర్తి చేస్తారు. మీరు అనుకున్న కోరికలు నెరవేరతాయి. పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. దైవారాధన మంచిది.
వ్రషభ రాశి వారికి విందు వినోదాల్లో చురుకుగా పాల్గొంటారు. అపోహలకు తావివ్వకండి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఈశ్వర దర్శనం మేలు చేస్తుంది.
మిథున రాశి వారికి ఉద్యోగంలో ఉన్నత స్థానం దక్కుతుంది. వ్యాపారంలో సలహాలు, సూచనలు తీసుకోవాలి. శివారాధన మంచి ఫలితాలు ఇస్తుంది.
కర్కాటక రాశి వారికి అనవసర ఖర్చులు పెరుగుతాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. ఆచితూచి అడుగులు వేయాలి. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చవడం శుభకరం.
సింహ రాశి వారికి చేసే పనుల్లో విజయం ఉంటుంది. ఒక శుభవార్త మీలో సంతోషాన్ని నింపుతుంది. దుర్గాదేవి ఆరాధన మంచి చేస్తుంది.
కన్య రాశి వారికి ఒక వార్త సంతోషం పెంచుతుంది. ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తారు. ఆర్థిక లాభాలున్నాయి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడడం శ్రేయస్కరం.
తుల రాశి వారికి ప్రయాణాలు లాభిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలున్నాయి. ఆధ్యాత్మికత వైపు ఆలోచిస్తారు. ఇష్టదేవతారాధన మేలు కలిగిస్తుంది.
వ్రశ్చిక రాశి వారికి కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. నిర్లక్ష్యంగా ఉండకూడదు. శ్రమతో విజయాలు లభిస్తాయి. గోసేవ చేయడం మంచిది.
ధనస్సు రాశి వారికి శుభవార్తలు వింటారు. ఆర్థిక లాభాలున్నాయి. అనుకూల పరిస్థితులుంటాయి. సుబ్రహ్మణ్యస్వామి దర్శనం మంచి ఫలితాలు ఇస్తుంది.
మకర రాశి వారికి మనోధైర్యం పెంచుతుంది. సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. చంచల బుద్ధితో వ్యవహరించొద్దు. విష్ణు నామస్మరణ శుభకరం.
కుంభ రాశి వారికి ఒక వార్త సంతోషం కలిగిస్తుంది. మీ ఆలోచన విధానంతో పనులు నెరవేర్చుకుంటారు. ఆధ్యాత్మికత వైపు ఆలోచిస్తారు. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం మేలు.
మీన రాశి వారికి మనోధైర్యంతో ముందడుగు వేస్తారు. శ్రమ పెరుగుతుంది. చేయని తప్పుకు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. దుర్గా పారాయణం మంచి ఫలితాలు ఇస్తుంది.