20th January Horoscope : నేటి రాశి ఫలాలు

20th January Horoscope

20th January Horoscope telugu

20th January Horoscope : మేష రాశి వారికి గొడవలకు దూరంగా ఉండాలి. ప్రశాంతంగా ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. అనుకూల కాలం. దుర్గారాధన మేలు కలిగిస్తుంది.

వ్రషభ రాశి వారికి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. చేపట్టే పనుల్లో విజయాలు దక్కుతాయి. అందరితో సంతోషం పంచుకుంటారు. విష్ణు స్తోత్రం చదువుకోవడం ఉత్తమం.

మిథున రాశి వారికి కొందరి తీరు బాధ కలిగిస్తుంది. సలహాలు తీసుకుంటే మంచిది. అందరితో కలివిడిగా ఉంటే మేలు జరుగుతుంది. ఆంజనేయ స్వామిని కొలవడం శరేయస్కరం.

కర్కాటక రాశి వారికి మనోధైర్యంతో ముందుకెళ్లాలి. తోటివారి సహకారంతో పనులు జరుగుతాయి. బంధువులతో సంతోషంగా ఉంటారు. కనకధారాస్తవం చదువుకోవడం మంచిది.

సింహ రాశి వారికి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించాలి. చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురు కావచ్చు. ఇష్టదేవతారాధన మంచి ఫలితాలు ఇస్తుంది.

కన్య రాశి వారికి మనోబలం పెరుగుతుంది. సహనం ఉండాలి. అనవసరంగా భయపడొద్దు. ఇష్టదేవత ఆరాధన శుభ ఫలితాలు తెస్తుంది.

తుల రాశి వారికి బంధువులతో సంతోషంగా ఉంటారు. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. హనుమాన్ చాలీసా చదవడం శుభకరం.

వ్రశ్చిక రాశి వారికి శారీరక శ్రమ పెరుగుతుంది. గొడవలకు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యుల సలహాతో విజయాలు అందుకుంటారు. సూర్య భగవానుడిని పూజించడం మంచిది.

ధనస్సు రాశి వారికి చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురవుతుంటాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దైవబలంతో మంచి ఫలితాలు సాధిస్తారు. ఇష్టదేవతారాధన శుభప్రదం.

మకర రాశి వారికి ఒక వార్త నిరుత్సాహ పరుస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెద్దల సలహాలు తీసుకుంటే మంచిది. నవగ్రహ స్తోత్రం చదవడం మేలు.

కుంభ రాశి వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విశ్రాంతి తీసుకోవాలి. ప్రయత్నంతో పనులు పూర్తి చేసుకుంటారు. చంద్ర శ్లోకం చదవడం ఉత్తమం.

మీన రాశి వారికి సంతోషంగా ఉంటారు. ఒక వార్త ధైర్యం పెంచుతుంది. ప్రణాళికలతో లాభాలు సాధిస్తారు. వెంకటేశ్వర స్వామి ఆరాధన శ్రేయోదాయకం.

TAGS