JAISW News Telugu

Allu Arjun-Arya : ‘ఆర్య’ రిలీజై 20 ఏళ్లు.. ఆ సినిమా జ్ఞాపకాలను పంచుకున్న అల్లు అర్జున్..

Allu Arjun-Arya

Allu Arjun-Arya

Allu Arjun-Arya : తన కల్ట్ క్లాసిక్ చిత్రం ‘ఆర్య’ సినిమా రిలీజై నేటికి సరిగ్గా 20 సంవత్సరాలు కావడంతో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అల్లు అర్జున్ దీనిపై మాట్లాడారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒకటి, రెండు సినిమాల్లో చేసినా.. హీరోగా మాత్రం ‘గంగోత్రి’తో ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్. కానీ ఈ సినిమా ఆయనకు అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు.

ఆ తర్వాత డైరెక్టర్ సుకుమార్ తో కలిసి ‘ఆర్య’ చేశాడు. 2004లో ఈ సినిమా ప్రేక్షకుల మందుకు వచ్చింది. ఈ మూవీతో అల్లు అర్జున్ ఒక్క సారిగా స్టార్ డం దక్కింది. ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ ను పూర్తిగా మార్చింది. డైరెక్టర్ సుకుమార్ కు కూడా ఇదే ఫస్ట్ మూవీ.

ఈ సినిమా గురించి అల్లు అర్జున్ తన ట్విటర్ లో ఇలా రాసుకున్నాడు. ‘ఆర్యకు 20 ఏళ్లు. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు.. నా జీవిత గమనాన్ని మార్చి వేసిన క్షణం అది. ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటాను’ అని రాసుకొచ్చారు.


అనురాధ మెహతా నటించిన రొమాంటిక్ యాక్షన్ కామెడీ ‘ఆర్య’ అల్లు ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇది అతని కెరీర్ లో స్పాట్ లైట్ పొందడానికి, తెలుగు సినిమాలో సుకుమార్ కు గుర్తింపు తీసుకురావడానికి సహాయపడింది.

2009లో విడుదలైన ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘ఆర్య 2’ కూడా తెరకెక్కింది. ఆర్య అనే కుర్రాడు గీత అనే యువతితో ప్రేమలో పడడం, అజయ్ అనే మరో వ్యక్తికి గీతను ఇచ్చి పెళ్లి చేసేందుకు పడే పాట్లతో ‘ఆర్య2’ ఉంటుంది. ఆర్య, ఆర్య2 రెండు సినిమాలకు సుకుమారే దర్శకత్వం వహించడం విశేషం.

2021లో ఐకాన్ స్టార్ పుష్ప: ది రైజ్ తో వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇది టాలీవుడ్ లోనే కాదు పాన్ ఇండియాగా.. పాన్ వరల్డ్ గా కూడా భారీ సక్సెస్ దక్కించుకుంది. ఈ సినిమాకు సంబంధించి పుష్ప రాజ్ కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డును కూడా సంపాదించి పెట్టింది.
ఇప్పుడు పుష్పకు సీక్వెల్ రాబోతోంది. పుష్ప2: ది రూల్ ఈ సినిమా షూటింగ్ షరవేగంగా సాగుతోంది. ఆగస్ట్ 15వ తేదీన రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 

Exit mobile version