Tata Group in AP : ఏపీలో టాటా గ్రూప్ ఆధ్వర్యంలో 20 హోటళ్లు

Tata Group in AP
Tata Group in AP : టాటా గ్రూపునకు చెందిన ఇండియన్ హోటల్స్ సంస్థ ఏపీలో పర్యాటక, పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించే ఉద్దేశంతో మరో 20 హోటళ్లను (తాజ్, వివాంతా, గేట్ వే, సెలెక్టియన్స్, జింజర్ హోటల్స్) ఏర్పాటు చేయాలని యోచిస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. సోమవారం జరిగిన సమావేశంలో రాష్ట్రాభివృద్ధికి అవసరమైన కీలక రంగాలపై టాటా సంస్థల ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ చంద్రశేఖరన్ తో చర్చించినట్లు ఆయన వెల్లడించారు. టాటా గ్రూప్ రాష్ట్రాభివృద్ధిలో ఒక ముఖ్య భాగస్వామిగా కొనసాగుతుందని సీఎం పేర్కొన్నారు.