Laapataa Ladies : మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్, ఆయన మాజీ సతీమణి కిరణ్ రావు, జ్యోతి దేశ్‌పాండే సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘లాపతా లేడీస్’. కిరణ్ రావు డైరెక్ట్ గా డైరెక్షన్ చేయడంతో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. జియో స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రం రిలీజ్‌కు ముందే భారీ బజ్ క్రియేట్ చేసింది. రీలీజ్ అయితే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ కురిపిస్తుందని అందరూ అనుకున్నారు కానీ అందుకు ఆపోజిట్ ఫలితాలు వచ్చాయి. ఈ చిత్రానికి సంబంధించి బడ్జెట్, బ్రేక్ ఈవెన్, కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే..
‘లాపతా లేడీస్’ కథ విషయానికి వస్తే..
కొత్తగా పెళ్లయిన జంట ట్రైన్ లో ప్రయాణిస్తుంది. తన భార్య అనుకొని మరో మహిళను భర్త పొరపాటున ఇంటికి తీసుకువస్తాడు. అతను తీసుకువచ్చింది తన భార్యను కాదని ఆ తర్వాత తెలుసుకుంటాడు. తన భార్య ట్రెయిన్ లో తప్పిపోయిందని వెతకడం, తాను పొరపాటున మరో ఊరికి వచ్చానని సదరు మహిళ గ్రహించడం.. ఆ తర్వాత ఏం జరిగిందనేది సినిమాలో చూడచ్చు. నితాన్షి గోయల్, స్పర్ష్ శ్రీవాస్తవ, ప్రతిభా రాంటా తదితరులు లీడ్ రోల్స్ లో కనిపించారు.
‘లాపతా లేడీస్’లో థియేటర్ ఆర్టిస్టులు, ప్రతిభావంతులైన నటులతో రూపొందించారు. రూ. 10 కోట్ల బడ్జెట్ అయినప్పటికీ.. ప్రమోషన్స్ భారీగా చేయడం, ఇతర ఖర్చులతో కలిపి రూ. 10 కోట్లు అదనంగా అయ్యింది. ఇక మొత్తం రూ. 20 కోట్ల బడ్జెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
రూ. 25 కోట్ల బ్రేక్ ఈ వెన్‌తో బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది. విడుదలకు ముందే మంచి బజ్ క్రియేట్ చేయగా ఇండియా వ్యప్తంగా 1500 స్క్రీన్లు, వరల్డ్ వైడ్ గా 1900 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఉత్తరాదిలో తప్ప మిగితా చోట్ల ఆశాజనక వసూళ్లు కనిపించలేదు. దీంతో అత్యంత పేలవంగా ఫెర్ఫార్మ్ చేసింది.
అమీర్ ఖాన్, కిరణ్ రావు పేర్లు కూడా ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించలేకపోయాయి. తొలి రోజు ఇండియాలో రూ. 75 లక్షలు, వరల్డ్ వైడ్‌గా కోటి, రెండో రోజు ఇండియా వ్యాప్తంగా రూ. 1.45 కోట్లు వరల్డ్ వైడ్ గా రూ. 2 కోట్ల, మూడో రోజు ఇండియా పరంగా రూ.2 కోట్లు, వరల్డ్ వైడ్‌గా రూ. 2.5 కోట్లు వసూలు చేసింది. 3 రోజుల్లో ఈ సినిమా రూ. 5.5 కోట్లు రాబట్టింది.
ఇక వీకెండ్ ముగిసి సోమవారంలోకి అడుగుపెట్టిన మూవీకి అగ్ని పరీక్ష ఎదురైంది. ఏది ఏమైనా నాలుగో రోజు నిలబడితే కలెక్షన్లు పుంజుకొనే అవకాశం ఉండనుందని వినిపిస్తున్నది. తాజా సమాచారం ప్రకారం సోమవారం నాలుగో రోజు కోటి రూపాయలు వసూలు చేస్తుందని అంచనా వేశారు. ఈ మొత్తానికి మించి వసూళ్లను సాధిస్తే.. థియేట్రికల్ రన్ కొనసాగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.