Pawan Kalyan Movie : స్టార్ అండ్ యంగ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహరాజ్ రవితేజ నటించిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. భారీ అంచనాల మధ్య ఆగస్ట్ 15న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో హరీశ్ శంకర్ వరుస ఇంటర్వ్యూ ఇస్తూ మూవీ విశేషాలను పంచుకుంటున్నారు. ‘బాలీవుడ్ మూవీ ‘రైడ్’కు రీమేక్‌గా ‘మిస్టర్ బచ్చన్’ తెరకెక్కించినప్పటికీ ఒరిజినల్ కథ, మిస్టర్ బచన్ కు అస్సలు పోలిక లేదు. 70 శాతంకు పైగా మార్పులు, చేర్పులు చేశాం. లవ్ స్టోరీని ఇతి వృత్తంగా తీసుకొని తెరకెక్కించాం. ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరూ కొత్త ప్రపంచంలోకి అడుగు పెడతారు.
ఇందులో హీరో ఎనర్జిటిక్‌గా ఉంటాడు. పాటలు కలర్‌ఫుల్‌గా ఉంటాయి. డైలాగులు గుర్తు పెట్టుకునేలా ఉంటాయి’ అని డైరెక్టర్ హరీశ్ శంకర్ చెప్పారు. ఇక పవన్ కల్యాణ్‌తో తీస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ గురించి గురించి కూడా కొన్ని విషయాలను చెప్పారు. ఆ సినిమా ప్రారంభంలో తనపై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయని చెప్పారు. ‘తెరీ’ రీమేక్ (ఉస్తాద్ భగత్‌సింగ్) ఆపేయాలని ట్రోల్ చేస్తూ 2లక్షలకు సైగా నెగెటివ్ ట్వీట్స్ వచ్చాయి.
నాకు తెలిసీ ఇది అతిపెద్ద రికార్డనే చెప్పాలి. ఏ దర్శకుడి మీద కూడా ఈ స్థాయిలో ట్రోలింగ్ ఎటాక్ జరగలేదు. అయినా నేను ఉస్తాద్ భగత్ సింగ్ చేయడం ఆపలేదు. ఆ టీజర్ విడుదలయ్యాక చైసిన వారిలో నన్ను ట్రోల్స్ చేసిన వారు తిరిగి నాకు స్వారీ చెప్పారు.’ అని హరీశ్ శంకర్ అన్నారు. ఇటీవల తను పవన్ కళ్యాణ్ ను కలిసినట్లు వెల్లడించారు. సినిమాలు పూర్తిచేయాలనే సంకల్పంతో ఉన్నారని.. త్వరలోనే దీని మిగిలిన షూటింగ్ పార్ట్ ప్రారంభిస్తామని శంకర్ తెలిపారు.