Rashmika Mandanna : 2 గంటల జర్నీ 20 నిమిషాల్లోనే.. నమ్మలేక పోతున్నా: రష్మిక
‘‘అటల్ సేతు వంతెనపై ప్రయాణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. రెండు గంటల ప్రయాణాన్ని కేవలం 20 నిమిషాల్లోనే పూర్తి చేయడం అమోఘం. ఇది సాధ్యమవుతుందని ఎవరూ అనుకోలేదు. ఈ బ్రిడ్జి వల్ల మనం ముంభై నుంచి నవీ ముంభైకి ఈజీగా జర్నీ చేయొచ్చు. ఇలాంటివి చూస్తుంటే భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుందని అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు మనల్ని ఎవరూ ఆపలేరు. యువ భారత్ దేన్నయిని సాధించగలదు. ఎందుకంటే గత పదేళ్లలో దేశం ఎంతగానో అభివృద్ధి చెందింది. దేశంలో మౌలిక వసతులు, రహదారులు అద్భుతంగా ఉన్నాయి. కనుక అందరూ అభివృద్ధికే ఓటు వేయాలి’’ అని రష్మిక పేర్కొన్నారు.
ముంభై నగరంలో నిర్మించిన సముద్రపు వంతెన ‘ముంబయి ట్రాన్స్ హార్బర్ లింక్’ ను జనవరిలో నరేంద్ర మోదీ ప్రారంభించారు. దేశంలోనే పొడవైన వంతెన ఇది. ముంభైలోని సేవ్రీ నుంచి రాయ్ గఢ్ లోని నహవా శేవాను కలుపుతూ రూ.21,200 కోట్ల వ్యయంతో 6 లేన్లుగా నిర్మించిన అటల్ సేతు మొత్తం పొడవు 21.8 కి.మీ.లు కాగా.. అందులో 16 కి.మీ.లకు పైగా అరేబియా సముద్రంపైనే ఉండటం విశేషం.