JAISW News Telugu

19th November Horoscope : నేటి రాశి ఫలాలు


19th November Horoscope : మేష రాశి వారికి సమయానికి సాయం చేస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కీలక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. హనుమాన్ చాలీసా చదువుకోవడం మంచిది.

వ్రషభ రాశి వారికి కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. విరోధులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కీలక విషయాల్లో సలహాలు తీసుకోవడం మంచిది. నవగ్రహ ఆరాధన శుభం కలిగిస్తుంది.

మిథున రాశి వారికి మానసిక ప్రశాంతత ఉండేలా చూసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. సమస్యలు లేకుండా ఉంటాయి. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం మేలు.

కర్కాటక రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రశంసలు దక్కుతాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. దైవారాధన మంచి ఫలితాలు ఇస్తుంది.

సింహ రాశి వారికి మానసిక ఉల్లాసం కలుగుతుంది. మంచి ఆలోచనలతో ముందుకు సాగుతారు. మీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇష్టదేవాన్ని ఆరాధించడం మంచిది.

కన్య రాశి వారికి అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగంలో శ్రమ ఎక్కువగా ఉంటుంది. సమస్యలను పరిష్కరించుకోవాలి. ఇష్టదేవతను దర్శించుకోవడం ఉత్తమం.

తుల రాశి వారికి ఒక విషయంలో సహాయం దొరుకుతుంది. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. విభేదాలు రాకుండా చూసుకోవాలి. దుర్గాస్తోత్రం చదవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

వ్రశ్చిక రాశి వారికి మానసిక ప్రశాంతత కలిగేలా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. పనులు త్వరగా పూర్తవుతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం శుభం.

ధనస్సు రాశి వారికి శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. పనుల్లో ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయి. విష్ణు సహస్ర నామాలు చదువుకోవడం శ్రేయస్కరం.

మకర రాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదవుకోవడం చాలా మంచిది.

కుంభ రాశి వారికి అధికారులతో జాగ్రత్త. చేయని తప్పుకు శిక్ష అనుభవించాల్సి రావచ్చు. ఉద్యోగంలో ఆచితూచి వ్యవహరించాలి. నవగ్రహ శ్లోకాలు చదవడం శుభకరం.

మీన రాశి వారికి ఒక శుభవార్త మీలో సంతోషం కలిగిస్తుంది. శుభ ఫలితాలున్నాయి. తోటి వారి సాయం అందుతుంది. శివారాధన చేయడం ఎంతో మంచిది.

Exit mobile version