JAISW News Telugu

19th January Horoscope : నేటి రాశి ఫలాలు

19th January Horoscope

19th January Horoscope

19th January Horoscope : మేష రాశి వారికి ఆర్థిక లాభాలున్నాయి. ఒక వార్త సంతోషం కలిగిస్తుంది. చేపట్టే పనుల్లో మంచి ఫలితాలుంటాయి. వెంకటేశ్వర స్వామిని పూజించడం శుభప్రదం.

వ్రషభ రాశి వారికి శారీరక శ్రమ పెరుగుతుంది. చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మంచి ఫలితాలు ఇస్తుంది.

మిథున రాశి వారికి కొన్ని విషయాల్లో బలంగా ఉండాలి. ఒక శుభవార్త ఆనందం కలిగిస్తుంది. పనుల్లో వేగం ఉంటుంది. ఇష్టదేవతారాధన శుభాలు కలిగిస్తుంది.

కర్కాటక రాశి వారికి ఉద్యోగంలో బాగుంటుంది. పనుల్లో వేగం పెరుగుతుంది. ముఖ్య సమస్యలను పరిష్కరించుకుంటారు. గణపతి ఆరాధన మేలు చేస్తుంది.

సింహ రాశి వారికి ఖర్చులు పెరిగే అవకాశముంది. మానసిక ప్రశాంతత కోసం కష్టపడాలి. అనుకున్నది సాధించాలని చూస్తారు. దుర్గా అష్టోత్తరం చదవడం చాలా మంచిది.

కన్య రాశి వారికి గొడవలకు దూరంగా ఉండాలి. పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. చంద్ర శ్లోకం చదవడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

తుల రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమయానికి సాయం అందుతుంది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. సూర్యాష్టకం చదవడం ఉత్తమం.

వ్రశ్చిక రాశి వారికి మంచి ఆలోచనలతో ముందుకు సాగుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ముందుచూపుతో ముందడుగు వేస్తారు. శివ నామస్మరణ మంచి ఫలితాలు ఇస్తుంది.

ధనస్సు రాశి వారికి కొన్ని సంఘటనలు ఇబ్బందులకు గురి చేస్తాయి. సమయం ప్రకారం ముందుకు సాగడం మంచిది. దుర్గా అష్టోత్తరం చదవడం శ్రేయస్కరం.

మకర రాశి వారికి ఒక వార్త సంతోషానికి కారణమవుతుంది. ప్రయాణాల్లో మంచి ఫలితాలున్నాయి. మొహమాటం దరిచేరనీయకండి. శ్రీరామ నామం మేలు కలిగిస్తుంది.

కుంభ రాశి వారికి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. సంతోషం కలిగించే సంఘటనలు జరుగుతుంటాయి. ఇష్టదేవారాధన వల్ల మంచి శకునాలే ఎదురవుతాయి.

మీన రాశి వారికి ఒక శుభవార్త సంతోషం కలిగిస్తుంది. ఆర్థిక సాయం అందుతుంది. కొన్ని వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. లక్ష్మీ దర్శనం చేసుకుంటే మంచిది.

Exit mobile version