JAISW News Telugu

TDP : 1983 సరిగ్గా ఈరోజే..టీడీపీ ప్రభంజనం..చరిత్ర లిఖితం..

TDP prabhanjanam

TDP prabhanjanam

TDP : నేడు అనగా జనవరి 5వ తేదీకి తెలుగు దేశం పార్టీ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు ఉంది. కొత్త తరం నేతలకు, కార్యకర్తలకు పెద్దగా ఈ ఎమోషన్ తెలియదు కానీ సీనియర్లకు ఆ డేట్ కు ఉండే ప్రత్యేకత ఏంటో తెలుసు. జనవరి 5వ తేదీ వస్తే మాత్రం పసుపు జెండా రెపరెపలు గుండెల్లోంచి వీస్తాయి. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన రోజు. ఈ రోజే టీడీపీ అధికారంలోకి వచ్చినట్టుగా ప్రజా తీర్పు వెల్లడైంది.

1983 ఎన్నికల్లో టీడీపీ సాధించిన అపూర్వ విజయం తెలుగు రాజకీయాల్లో పెను సంచలనం. ఎన్టీఆర్ ప్రభంజనాన్ని ఎవరూ ఊహించలేకపోయారు. ఇప్పటిలా సర్వేలు గట్రాలు ఏమి లేవు. జనాలు సైలెంట్ గా ఓటు వేసి వచ్చేవారు.  సినిమా హీరో పార్టీ పెడితే సీఎం అయిపోతారా? అని చాలా మంది అనుమాన పడ్డారు. కానీ వాటిని పటాపంచలు చేస్తూ తెలుగు జనాలు అద్భుత తీర్పు ఇచ్చారు. 46శాతం ఓట్లతో 201 సీట్లు సాధించి టీడీపీకి ఘన విజయం అందించారు.

5వ తేదీన ప్రజల తీర్పుతో ఎంతో మంది బీసీలు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో రెడ్లు, అగ్రవర్ణాలు తప్ప బీసీలకు చోటే లేదు. ఇక ఎస్సీ, ఎస్టీలు రిజర్వేషన్ ప్రకారం ఎన్నికయ్యేవారు. జనాభాలో సగం కంటే ఎక్కువుండే బీసీలకు కాంగ్రెస్ ప్రాధాన్యమివ్వలేదు. దీన్ని గమనించిన ఎన్టీఆర్ బీసీలకు భారీ సంఖ్యలో సీట్లు ఇచ్చారు. దీంతో వారు అసెంబ్లీలో అడుగుపెట్టగలిగారు. అందుకే ఈ రోజు బీసీలకు కూడా ఓ ఎమోషన్ ఉంటుందనే చెప్పాలి.

ఎన్నో ప్రాంతీయ పార్టీలు వచ్చాయి.. పోయాయి. టీడీపీ మాత్రం మొదట వచ్చిన ఫలితాల బలంతో.. సిద్ధాంతపరంగా పునాదులను బలంగా వేసుకుని ఇప్పటికీ ఘనమైన ప్రస్థానం కొనసాగిస్తోంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఏపీకే పరిమితమైన టీడీపీ..మరోసారి అక్కడ జెండా ఎగురవేయడానికి వ్యూహాలు రెడీ చేసుకుంటోంది.

Exit mobile version